వికలాంగురాలిని వీల్ చైర్ లోనే తగులబెట్టిన దుండగులు.. ఒంగోలులో దారుణం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రపదేశ్ లోని ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని దశరాజుపల్లి దగ్గర ఓ యువతిని పెట్రోల్ పోసి తగులబెట్టారు దుండగులు.

 • News18
 • Last Updated :
 • Share this:
  ఆంధ్రపదేశ్ లోని ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని దశరాజుపల్లి దగ్గర ఓ యువతిని పెట్రోల్ పోసి తగులబెట్టారు దుండగులు. చనిపోయిన యువతి.. వికలాంగురాలు. ఆమె చక్రాల కుర్చీలో కూర్చొన్న చోటే.. పెట్రోల్ పోసి కాల్చి నిప్పంటించారు దుర్మార్గులు. మృతురాలిని ఒంగోలులోని గోపాల్ నగర్ కు చెందిన భువనేశ్వరి గా గుర్తించారు. ఈ కేసును పోలీసులు అనుమానాస్పద మృతి గా నమోదు చేశారు. కాగా, యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఒంగోలు లో చర్చనీయాంశంగా మారింది. ఇంతటి దారుణానికి ఒడిగట్టింది ఎవరు..? అనే దాని మీద పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ఆ యువతికి తెలిసినవాళ్లు చేసిందా..? లేక బయటి వ్యక్తులా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దివ్యాంగురాలైన భువనేశ్వరిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉందని వారు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

  ఒంగోలులోనే మరో దారుణం, నడిరోడ్డు మీద హత్య
  తాజాగా ఒంగోలులోనే మరో దారుణం జరిగింది. తన భార్యను వేధస్తున్నాడన్న కోపంతో భర్త ఓయువకుడ్ని నడిరోడ్డుపై పొడిచిచంపాడు. అందరూ చూస్తుండగానే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చేదిన జోసెఫ్ అనే వ్యక్తి భార్య ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తోంది. అదే మాల్ లో థామస్ అనే యువకుడు కూడా పనిచేస్తున్నాడు. ఇటీవల ఇద్దరి మధ్య చిన్న వివాదం చోటు చేసుకుంది. ఇదే విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పింది. దీంతో జోసెఫ్.. థామస్ పై కోపం పెంచుకున్నాడు. ఇది పెద్ద విషయం కాదని భార్య జోసెఫ్ కు చెప్పినా వినలేదు. ఒకసారి మాట్లాడతానని చెప్పి భార్యతో ఫోన్ చేయించాడు. దీంతో అతడు గాంధీ పార్క్ వద్దకు వచ్చాడు. దీంతో అక్కడికొచ్చిన థామస్ పై.. నిందితుడు ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు.
  Published by:Srinivas Munigala
  First published: