కాళ్లు చచ్చుబడిపోయినా.. 25 బైక్‌లతో ఉడాయించాడు.. చివరికి..

AP Crime News: ఒంగోలుతో పాటు సమీప ప్రాంతాల్లోని రద్దీ ప్రాంతాల్లో మాటు వేసి, అక్కడ పార్కింగ్‌ చేసే వాహనాలపై దృష్టి సారిస్తాడు. చిన్నగా పాకుతూ సదరు వాహనం వద్దకు చేరుకుంటాడు. అక్కడే కాసేపు తచ్చాడుతూ తన వద్ద ఉన్న తాళాలతో సదరు వాహనాన్ని స్టార్ట్‌ చేసే ప్రయత్నం చేస్తాడు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 19, 2019, 2:06 PM IST
కాళ్లు చచ్చుబడిపోయినా.. 25 బైక్‌లతో ఉడాయించాడు.. చివరికి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అతనో దివ్యాంగుడు.. రెండు కాళ్లూ పనిచేయవు.. కూర్చున్న చోట నుంచి వేగంగా ముందుకు కదల్లేడు. చోరకళలో మాత్రం ఆరితేరాడు. ఏదో ఒక బస్టాండులో మాటువేయటం, అక్కడ పార్కింగ్‌ చేసిన వాహనాల వద్దకు చేరుకోవడం, వాటి తీగలు కత్తిరించి వాహనంతో ఉడాయించడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. పలు ప్రాంతాల్లో ఈ తరహా అతడు పదుల సంఖ్యలో టీవీఎస్‌ మోపెడ్లు అపహరిస్తూ తన చేతివాటం చూపాడు. అయితే, చివరకు అతనికి ఒంగోలు సీసీఎస్‌ పోలీసులు ముకుతాడు వేశారు. వివరాల్లోకెళితే.. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల రాజుపాలెం గ్రామానికి చెందిన ఉప్పాల పూర్ణచంద్రరావు దివ్యాంగుడు. రెండు కాళ్లు పనిచేయవు. కానీ, దొంగతనాలు చేయడంలో దిట్ట. ఒంగోలుతో పాటు సమీప ప్రాంతాల్లోని రద్దీ ప్రాంతాల్లో మాటు వేసి, అక్కడ పార్కింగ్‌ చేసే వాహనాలపై దృష్టి సారిస్తాడు. చిన్నగా పాకుతూ సదరు వాహనం వద్దకు చేరుకుంటాడు. అక్కడే కాసేపు తచ్చాడుతూ తన వద్ద ఉన్న తాళాలతో సదరు వాహనాన్ని స్టార్ట్‌ చేసే ప్రయత్నం చేస్తాడు. అది రాకపోతే ఇగ్నీషన్‌ తీగలు పీకేస్తాడు. సమీపంలో ఉన్న వాళ్ల సాయం తీసుకుని వాహనం స్టార్ట్‌ చేయించుకుని అక్కడి నుంచి ఉడాయిస్తాడు.

అలా తస్కరించిన వాహనాలను తక్కువ ధరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అమ్మేస్తాడు. ఈ తరహాలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిందితుడు యథేచ్ఛగా టీవీఎస్‌ మోపెడ్లను అపహరించుకుని వెళ్లాడు.జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఈ తరహా ఫిర్యాదులు అధికమయ్యాయి. పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దాంతో ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ఆదేశాల మేరకు సీసీఎస్‌ పోలీసులు వీటిపై దృష్టి పెట్టారు.

పూర్ణచంద్రరావు దొంగతనం చేసిన వాహనాలు ఇవే..


డీఎస్పీ ప్రసాద్‌కుమార్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ పరంధామయ్య ఆధ్వర్యంలో ఎస్‌.ఐ. కమలాకర్‌ తమ సిబ్బందితో ఆ తరహా నేరాలకు పాల్పడుతున్న వ్యక్తుల గురించి ఆరా తీశారు. 2013లో ఒక వ్యక్తి జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీవీఎస్‌ మోపెడ్లు అపహరించి పోలీసులకు పట్టుబడిన విషయాన్ని గుర్తించారు. వరసగా నేరాలు జరుగుతున్న బస్టాండ్‌ ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా ఇతగాడి నిర్వాకం బట్టబయలైంది. పలుచోట్ల అతడు 25 మోపెడ్లు అపహరించి విక్రయించినట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: June 19, 2019, 2:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading