హోమ్ /వార్తలు /క్రైమ్ /

Crime News : కలకలం రేపుతున్న చీకోటి ప్రవీణ్‌ బర్త్‌ డే ఫోటోస్‌..చీకటి సామ్రాజ్యంలో వాళ్లూ భాగస్వాములేనా..

Crime News : కలకలం రేపుతున్న చీకోటి ప్రవీణ్‌ బర్త్‌ డే ఫోటోస్‌..చీకటి సామ్రాజ్యంలో వాళ్లూ భాగస్వాములేనా..

(Chekoti Praveen Kumar)

(Chekoti Praveen Kumar)

Crime news: చీకోటి ప్రవీణ్‌కుమార్‌ చీకటి సామ్రాజ్యంలో ఇంకా ఎంత మంది ఉన్నారు..? అతనితో ఆర్ధిక లావాదేవీలు, పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మార్చడం వెనుక దాగి వున్న వాస్తవాలేంటి..? ప్రత్యేకించి పవిత్ర దేవస్థానంలో అతని పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన వారిలో ఎవరు కీలక పాత్ర పోషించారు..ఇప్పుడు ఈ సందేహాలే తెరపైకి వచ్చాయి.

ఇంకా చదవండి ...

(K.Veeranna,News18,Medak)

చీకోటి ప్రవీణ్‌కుమార్(Chekoti Praveen Kumar) ..వారం రోజుల క్రితం వరకు అతనెవరో చాలా మందికి తెలియదు. కాని ఇప్పుడు అతని వెనుక పెద్ద చీకటి సామ్రాజ్యమే ఉందనే విషయాన్ని బయటకు లాగుతున్నారు అధికారులు. క్యాసినో కేంద్రాల నిర్వాహణ పేరుతో నేతల దగ్గర నుంచి బడా బడా బిజినెస్‌మెన్‌లు(Businessmen), సెలబ్రిటీలు(celebrities)చీకోటి స్నేహితులు, అతనికి సన్నిహితులని బయటపడుతోంది. తాజాగా మెదక్‌ (Medak) జిల్లా నేతలతో ఆయనకున్న లింకులు..ఆయన బర్త్ డే పార్టీ(Birthday party)పేరుతో చేసిన హంగామాకు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో అతనితో సంబంధం ఉన్న ఒక్కొక్కరిలో వణుకు మొదలైంది. అసలు చీకోటి ప్రవీణ్‌కుమార్‌తో మెదక్ జిల్లాలో ఎవరెవరికి లింకులు ఉన్నాయి..వాళ్లెవరూ అనే విషయాన్ని లాగుతున్నారు.

Telangana : తీసుకున్న అప్పు టైమ్‌కి చెల్లించలేదని .. ఆ ఫ్యామిలీని ఏం చేశారో తెలుసా


చీకోటి చీకటి మిత్రులు ఎవరూ..

విదేశాలు, గోవా, నేపాల్‌లో క్యాసినో కేంద్రాల నిర్వాహణ పేరుతో భారీ మొత్తంలో డబ్బును హవాలా మార్గంలో తరలించినట్లుగా ఈడీ గుర్తించిన కేసులో ప్రధానమైన వ్యక్తే చీకోటి ప్రవీణ్‌కుమార్‌. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులకు అందిన సమాచారంతో నోటీసులు ఇచ్చి చీకోటిని అదుపులోకి తీసుకున్న అధికారులు తీగ లాగితే అతని వెనుకున్న డొంక కదులుతోంది. ముఖ్యంగా చీకోటి ప్రవీణ్‌కుమార్‌కు మెదక్ జిల్లాకు చెందిన రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం తాజాగా బయటపడింది. ఈనెల 19న మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ మాత సన్నిధిలోనే హరిత రెస్టారెంట్‌ చీకోటి ప్రవీణ్ విందుకు హాజరైనట్లు సమాచారం ఉంది. దీనిపై ఆరా తీసిన అధికారులు జిల్లా నేతలతో చీకోటికి సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు భగ్గుమన్నాయి.


బర్త్ డే పార్టీ వెనుక సీక్రెట్ ఏంటీ..

ఈనెల 19వ తేదిన హరిత రెస్టారెంట్‌లో చక్రపాణి పేరుతో ఆరు గదులు, రెండు హాల్స్ బుక్ అయ్యాయి. బర్తడే పార్టీకి ఈనెల 19న ఏడుపాయలకు వచ్చిన చికోటి తో పాటు 150 మంది ప్రముఖులు హాజరైనట్లుగా తెలిసింది. గోవాకు వెళ్ళినప్పుడు చీకోటికి పరిచయమైన ఉమ్మడి  మెదక్ జిల్లా ప్రముఖులు, వ్యాపారులు, ప్రముఖ రాజకీయ నాయకుడు ఈ పార్టీలో చీకోటిని ఘనంగా సన్మానించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చీకోటి చీకటి వ్యవహారంలో వ్యాపారస్తుల పేర్లు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి పేరు వినిపిస్తుంది. చికోటి చి చి వ్యవహారం బయటకు పొక్కగానే ఎవరు ఊహించనంతగా మెదక్ టౌన్‌ ఉలిక్కిపడింది.

వైట్ డ్రెస్‌ల ముసుగులో చీకటి నేరాలు..

ఎంతో పవిత్ర క్షేత్రంగా పేరొందిన ఏడుపాయల దేవాలయ డైరెక్టర్ హోదాలో ఉంటూ అలాగే ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ హోటల్ చంద్ర భవన్ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు చక్రపాణి. అతనితో పాటు గన్నిస్ వడ్డీ వ్యాపారమ్ నిర్వహించే యాచాము రాజు ఇంకా అయన మిత్రులతో పాటు మెదక్ మున్సిపల్ ఛైర్మెన్ చంద్రపాల్ కుమారుడు శివరామకృష్ణ, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొండా శ్రీను గ్యాంగ్‌తో పాటు మరికొందరి పేర్లు ఈ పార్టీకి అటెండ్ అయిన వాళ్ల జాబితాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వీళ్లతో పాటు మరికొందరు పేర్లు కూడా బయటకు రావాల్సి ఉందంటున్నారు అధికారులు.

BJP New Plan: తెలంగాణలో గోవా మోడల్.. బీజేపీ సరికొత్త ప్లాన్.. అదేంటంటే..తీగ లాగితే డొంక కదులుతోంది..

మెదక్‌ జిల్లాలోనే కాదు చీకోటి ప్రవీణ్‌తో ఆర్ధిక సంబంధాలు ఉన్నాయనే ఆరోపణతో హైదరాబాద్‌ తార్నాకలోని ఓ రైల్వే కాంట్రాక్టర్‌ ఇంట్లో కూడా ఈడీ శనివారం సోదాలు నిర్వహించింది. నకిలీ బిల్లులు సృష్టించి సుమారు రూ.100 కోట్ల మేర మోసాలకు పాల్పడ్డారని సదరు కాంట్రాక్టర్‌పై ఆరోపణలున్నాయి. కాంట్రాక్టర్‌ దగ్గర అధికారులు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకొన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే చీకోటి ప్రవీణ్‌కుమార్‌తో చాలా మంది నేతలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై కాంగ్రెస్‌ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు మంత్రి మల్లారెడ్డి తన కారు ఎమ్మెల్యే స్టిక్కర్ తీసి పారేశానని చెప్పడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తప్పు పట్టారు. ఈకేసులో ఆయన్ని కూడా విచారించాలని కోరారు.

First published:

Tags: Medak, Telangana crime news

ఉత్తమ కథలు