నేరేడ్మెట్‌లో ఫోటోస్టూడియోలో దారుణం... ఫోటోకోసం వచ్చిన బాలికపై అత్యాచారయత్నం

బాలిక అరుచుకుంటూ బయటకి పరుగులు తీయడంతో స్థానికులు స్టూడియో యజమాని సలీంకి దేహశుద్ది చేసారు.

news18-telugu
Updated: February 18, 2020, 1:14 PM IST
నేరేడ్మెట్‌లో ఫోటోస్టూడియోలో దారుణం... ఫోటోకోసం వచ్చిన బాలికపై అత్యాచారయత్నం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఫోటో కోసం వచ్చిన మైనర్ బాలికపై ఫోటో గ్రాఫర్ అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఫోటో దిగేందుకు వెళ్లిన బాలికతో అక్కడున్న ఫోటోగ్రాఫర్ సలీం అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక భయపడి గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. సికింద్రాబాద్ నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సైనిక్ పురిలోని ఆర్.ఎస్ డిజిటల్ ఫోటో స్టూడియోలో ఫోటో దిగేందుకు ఓ బాలిక వెళ్లింది. మైనర్ బాలికతో స్టూడియో యజమాని సలీం అసభ్యంగా ప్రవర్తించాడు . బాలికపై అత్యాచారం చేసే ప్రయతం చేసాడు. దీంతో బాలిక అరుచుకుంటూ బయటకి పరుగులు తీయడంతో స్థానికులు స్టూడియో యజమాని సలీంకి దేహశుద్ది చేసారు. బాలిక తల్లి నెరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం గాయాలుపాలైన నిందితుడు సలీం స్థానిక హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు .

First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు