Home /News /crime /

PET DOG HELPS FAMILY CATCH THIEF IN KOLKATA PAH

శభాష్ రాకీ.. యజమాని పట్ల దీనికున్న విశ్వాసానికి పోలీసులు షాక్... ఏం చేసిందంటే..

పెంపుడు కుక్క రాకీ

పెంపుడు కుక్క రాకీ

Kolkata: ఇంట్లో తెల్లవారు జామున దొంగ ప్రవేశించాడు. అతడిని గమనించిన ఇంట్లో వారు అలారం మోగించారు. ఇంతలో దొంగ వారిపై కత్తులతో దాడికి తెగబడ్డాడు.

దొంగలు తాళాలున్న ఇళ్లను టార్గెట్ చేసుకుంటారు. కొంత మంది అర్ధరాత్రి చోరీలకు పాల్పడు తుంటారు. అదే విధంగా, కొందరు బట్టల దుకాణాలు, బంగారం దుకాణాలలో చోరీలు చేస్తుండటం మనం తరచుగా వార్తలలో చూస్తుంటాం. కొన్ని సార్లు.. దొంగలు ఫన్నీ గా ప్రవర్తిస్తుంటారు. చోరికి వచ్చి.. ఇంట్లో నిద్రపోతుంటారు. మరికొందరు.. ఇంట్లో ఉన్న ఆహారం తింటుంటారు. మరికొన్ని సార్లు.. దొంగలు చోరీలు చేస్తు అడ్డంగా కూడా దొరికిపోతుంటారు. ఇంకొన్ని సార్లు.. దొంగలను ఇంట్లో వారిపై దాడులకు కూడా పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటన ఇప్పుడు వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. కోల్ కతాలో (kolkata) ఒక దొంగ ఇంట్లో ప్రవేశించాడు. సీఎం మమతా బెనర్జీ ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న జాదు భట్టాచార్య లేన్ లో ప్రవేశించాడు. అక్కడ ఒక ఇంట్లోకి చోరి కోసం వెళ్లాడు. అక్కడ.. ఇంట్లో వారు మంచి నిద్రలో ఉన్నారు. అప్పుడు మెల్లగా చప్పుడు చేయకుండా ఇంట్లో ప్రవేశించాడు. అయితే, అక్కడ అలికిడి రావడంతో ఇంట్లోని వారు కిటీకి నుంచి చూశారు. దొంగలను గమనించారు. వెంటనే అలారం మోగించారు. అయితే.. ఇంట్లోని వారు బైటకు వచ్చారు. దీంతో దొంగ తనచేతిలో ఉన్న కత్తులతో ఇంట్లోని వారిపై దాడికి తెగబడ్డాడు.. అక్కడే ఉన్న ప్రసేన్ జిత్ చక్రవర్తిపై కత్తితో దాడి చేశాడు.



అయితే, వారు ఒక కుక్కను  (Pet dog) పెంచుకుంటున్నారు. అది దొంగ మీద దాడి చేసింది. అతడిని కిందపడేసి చేతులను, కాళ్లను కొరికింది. దీంతో అతను గాయాలపాలయ్యాడు. ఈ క్రమంలో.. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దొంగను అదుపులోనికి తీసుకున్నారు. అతడికి కుక్క కరిచిన గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అతడిని చూసిన వైద్యులు మెడ, భూజానికి 35 చోట్ల గాయాలయ్యాయని తెలిపారు. వీటికి కుట్లు వేశారు. కుక్క దాడిని ఘటనను చూసి.. పోలీసులే షాక్ అయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

అమెరికాలోని (america) సౌత్ కరోలినా లోని మిర్టిల్ బీచ్ సఫారీలో చింపాంజీ, మూడు పులి పిల్లలను ప్రేమగా లాలిస్తుంది. అచ్చం అవి తమ తల్లి వద్ద ఉన్నట్లు వాటితో గడుపుతున్నాయి. చింపాంజీ (Orangutan) కూడా పులి పిల్లలకు పాలు తాగిస్తు.. వాటిని తన చేతుల్లో ఎత్తుకుంది. ఆ తర్వాత.. దాన్ని ప్రేమగా నిమురుతూ.. కౌగిలించుకుంటూ.. భావోద్వేగానికి లోనైంది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు ఎమోషన్ కు (Emotional   Video)  గురౌతున్నారు. మిర్టిల్ బీచ్ సఫారీలో చింపాంజీ, మూడు పులి పిల్లలకు (Tiger cubs) సర్రోగేట్ మదర్ గా మారినట్లు తెలుస్తోంది.  కాగా, ఈ వీడియోను.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సమ్రాట్ గౌడ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Kolkata, Pet dog, VIRAL NEWS, West Bengal

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు