Dog died while saving owner: విశ్వాసానికి ప్రతిరూపంగా కుక్కని భావిస్తుంటారు. కుక్కకు ఉన్న విశ్వాసం మనిషికి కూడా ఉండదంటారు పెద్దలు. తనను పెంచుకునే యజమానికి కుక్క చివరి వరకూ తన విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది. కుక్క చూపించే విశ్వాసంపై ఎన్నో ఆసక్తికర సంఘటనలు గతంలో వెలుగుచూశాయి అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. కరోనా కష్టకాలంలో కరోనా మహమ్మారితో యజమాని చనిపోయినా అయిన వాళ్ళందరూ దూరంగా ఉన్నా, పెంపుడు కుక్కలు మాత్రం ఆ యజమానితో చివరి వరకు సాగిన దృశ్యాలు అనేకం చూశాం. ప్రేమగా చూసే యజమాని పట్ల అవి ఎంతో నిబద్ధతో ఉంటాయి. ఆ ఇంటికి ఎలాంటి హానీ కలుగకుండా చూసుకుంటాయి. అలాంటిదే ఓ కుక్క తన ఓనర్‌ను కాపాడి ప్రాణాలు పొగొట్టుకుంది. యజమానిపై జరిపిన తుపాకీ కాల్పులకు అడ్డుగా నిలిచి ఊపిరి వదిలింది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ లోని సుల్తానాపుర్లో చోటు చేసుకుంది.
ఉత్తర్‌ప్రదేశ్(UttarPradesh)రాష్ట్రంలోని సుల్తానాపుర్లోని వికవాజిత్పుర్ లో విశాల్ శ్రీవాస్తవ అలియాస్ శని అనే వ్యక్తి కొన్నేళ్లుగా గోశాల నడిపిస్తున్నారు. ఆదివారం రోజున గోశాల ప్రాంగణంలోనే గడ్డి ఉంచడానికి ఓ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న రాంబరన్ పీజీ కాలేజ్ మేనేజర్ అనిల్ వర్మ.. తన డ్రైవర్‌తో వచ్చి ఆ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అనిల్ వర్మ-విశాల్ శ్రీవాస్తవ మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన అనిల్ వర్మ.. తన లైసెన్స్డ్ తుపాకీతో విశాల్పైకి కాల్పులు జరిపాడు. ఈ సమయంలో విశాల్ పెంపుడు కుక్క" మ్యాక్స్" అక్కడే ఉంది. యజమానిపైకి కాల్పులు జరగడాన్ని పసిగట్టిన మ్యాక్స్ ముందుకు దూకింది. యజమానిపై జరిపిన తుపాకీ కాల్పులకు అడ్డుగా నిలిచింది. దీంతో బుల్లెట్ గాయం దానికే అయ్యింది. అనంతరం అనిల్ వర్మ అక్కడి నుంచి పారిపోగా,శునకాన్ని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి తరలించారు. అక్కడే కొన్ని గంటల తర్వాత మాక్స్ చనిపోయింది. విశాల్ శ్రీవాస్తవ ఫిర్యాదు మేరకు అనిల్ వర్మపై కేసు నమోదైంది. పోర్టుమార్టం నివేదిక అనంతరం అతడిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.
ALSO READ DNA Test For Buffalo : బర్రెకు డీఎన్ఏ టెస్ట్..ఎందుకో తెలుసా!
మరోవైపు,ఇటీవల ఖండూ భాయ్ అనే వీధి శునకం పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు పుణెలోని సావిత్రిబాయి ఫూలే విశ్వవిద్యాలయ విద్యార్థులు. మే26న ఈ వేడుకలను ఓ బ్యానర్, కేక్, పటాసులతో అట్టహాసంగా నిర్వహించారు. ఈ శునకం పేరిట ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అకౌంట్ కూడా ఉంది. బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోలను, ఇతర ఫొటోలను అందులో పోస్ట్ చేస్తుంటారు విద్యార్థులు. ఆ కుక్క ఎప్పుడూ ఆ యూనివర్సిటీలో తిరుగుతూ ఉంటుంది. దానితో సరదాగా ఆటలాడటం ప్రారంభించిన అక్కడి విద్యార్థులకు ఆ శునకం ఫేవరెట్‌గా మారింది. ఖాళీ సమయాల్లో దానితో ఆటడం, స్నానం చేయించడం లాంటివీ చేస్తున్నారు ఆ విద్యార్థులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Died, Pet dog, Uttar pradesh