దొంగతనం చేసే వాళ్లు దొరికితే ఎలాంటి శిక్ష విధిస్తారనే విషయాన్ని ఆలోచించరు. తమకు అవసరం కాబట్టి ఏదో ఒక దొంగిలించుకొని వెళ్లాని ప్రయత్నం చేస్తుంటారు. పంజాబ్(Punjab)లో అదే విధంగా ఓ వ్యక్తి లారీలోని గోదుమల సంచులు (Wheat bags)దొంగిలించాడు. రెండు బస్తాల గోదుమలు ఎత్తుకెళ్లడం లారీ డ్రైవర్ (Lorry driver)కంట పడటంతో దొంగతనం చేసిన వ్యక్తికి ఎలాంటి శిక్ష వేశాడో తెలిస్తే షాక్ అవుతారు. పంజాబ్‌లోని ముక్త్‌సర్ జిల్లాలో ఈ అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ గోదుమ బస్తాలు చోరీ చేసిన వ్యక్తికి వేసిన శిక్ష ఏంటో మీరే చూడండి.
అమానవీయ సంఘటన..
కొన్ని సంఘటనలు నేరం చేసిన వాళ్లకంటే దానికి బాధ్యులైన వాళ్లు తీసుకునే నిర్ణయాలే వివాదాస్పదమవుతాయి. పంజాబ్‌లోని ముక్తసర్ జిల్లాలో అలాంటి సంఘటనే జరిగింది. గోదుమ సంచుల లోడుతో వెళ్తున్న లారీని ఇద్దరు వ్యక్తులు ఫాలో అయ్యారు. ఒక వ్యక్తి లారీపైకి ఎక్కి అందులోని రెండు గోదుమల బస్తాలు తీసి రోడ్డుపై పడేశాడు. వాటిని లారీ వెనుకాలో ఫాలో అయిన మరో వ్యక్తి బైక్‌పై పెట్టుకొని తీసుకెళ్లాడు. లారీలో దొంగతనం జరుగుతున్నట్లుగా గ్రహించిన డ్రైవర్ వెంటనే దొంగను పట్టుకొని తాళ్లతో లారీ బ్యానట్‌కు కట్టాడు. అతను కిందపడిపోకుండా లారీ క్లీనర్‌ని పట్టుకొని కూర్చొబెట్టాడు. ఈవిధంగా బస్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు లారీ బ్యానెట్‌కి కట్టుకొని తీసుకెళ్లాడు డ్రైవర్.
చిన్న నేరానికి పెద్ద శిక్ష..
ఒక మనిషిని నేరం చేసినందుకు లారీ బ్యానెట్‌కి కట్టుకొని తీసుకెళ్తున్న దృశ్యాలు స్థానికంగా కలకలం రేపాయి. స్థానికులు, రోడ్డుపైన వెళ్తున్న వాళ్లాంతా ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే వీడియో కాస్తా వైరల్ అయింది. అయితే తాళ్లతో లారీ బ్యానెట్‌కి కట్టుకొని దొంగతనం చేసిన వ్యక్తిని పోలీసులకు అప్పగించాడు డ్రైవర్.
వైరల్ అవుతున్న వీడియో..
సంఘటనలో చోరీ చేస్తున్న దృశ్యాలతో పాటు లారీకి నిందితుడ్ని కట్టుకొని తీసుకొచ్చిన వీడియో తమకు చేరిందని ముక్తసర్ పోలీసులు తెలిపారు.ట్రక్ డ్రైవర్‌తో పాటు చోరీ చేసిన వ్యక్తిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్‌ఐ జగదీష్‌కుమార్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: National News, Punjab, Viral Video