దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో మరో దారుణ సంఘటన కలకలం రేపుతోంది. ఆరోగ్యం బాగోలేదని ఓ మైనర్ బాలికను(Minor Girl) తల్లి భూతవైద్యుడికి చూపిస్తే ..అతను వైద్యం పేరుతో అరాచకానికి పాల్పడ్డాడు. 14సంవత్సరాల(14Years old) బాలికపై పదే పదే అత్యాచారం చేసి ఆమె గర్భం దాల్చడానికి కారణమయ్యాడు. భూతవైద్యుడి అఘాయిత్యంతో రెండు నెలల గర్బవతి(Pregnant) అయినట్లుగా గుర్తించిన బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోక్సో చట్టం(POCSO Act)కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.య
గర్భవతైన మైనర్ బాలిక..
తాంత్రిక పూజలు, భూతవైద్యుల మాటలు నమ్మి మోసపోయే వాళ్లు సమాజంలో ఇంకా చాలా మంది ఉన్నారు. అమాయకత్వమో , అనాలోచితమో తెలియక మోసగాళ్ల ఉచ్చులో పడి ఆర్ధికంగా, ఆరోగ్యాన్ని నష్టపోతున్నారు. ఢిల్లీ ఇదే తరహాలో ఓ నయవంచకుడు ఓ కుటుంబాన్ని మోసం చేశాడు. మైనర్ బాలికను గర్భవతిని చేశాడు. ఆరోగ్యం బాగోటం లేదని 14ఏళ్ల బాలికను వైద్యం కోసం తీసుకొచ్చిన తల్లిని బయటకు వెళ్లమని చెప్పి..మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. భూతవైద్యుడి ముసుగులో ఇదే విధంగా పలుమార్లు మైనర్ బాలికపై తన కామవాంఛ తీర్చుకున్నాడు.
భూతవైద్యుడి నిజస్వరూపం..
భూతవైద్యుడికి చూపించిన తర్వాత బాలిక శరీరంలో మార్పు రావడం, మరికొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తడంతో తల్లికి అనుమానం వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే అప్పటికే బాలిక రెండు నెలల గర్భవతిగా డాక్టర్లు తేల్చడంతో బాధితురాలి తల్లి బాబా హరిదాస్‌నగర్ పోలీసులకు భూతవైద్యుడిపై కంప్లైంట్ చేసింది.
భూతవైద్యం పేరుతో కామవాంచ తీర్చుకున్న నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం గర్భం దాల్చిన బాలిక కాకుండా ఇంకా ఎవరిపైన అయినా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడి ఉంటాడనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi news, Minor girl pregnant