విషం తాగిన వ్యక్తిని ఆస్పత్రికి బదులుగా గుడికి తీసుకెళ్లారు... రెండు రోజుల తర్వాత...

విషం తాగిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా నేరుగా గుడికి తీసుకెళ్లారు అతడి బంధువులు, ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

news18-telugu
Updated: May 22, 2019, 7:36 PM IST
విషం తాగిన వ్యక్తిని ఆస్పత్రికి బదులుగా గుడికి తీసుకెళ్లారు... రెండు రోజుల తర్వాత...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 22, 2019, 7:36 PM IST
టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతున్నా... జనంలో మూఢ విశ్వాసాలపై ఉన్న నమ్మకం మాత్రం తగ్గడం లేదు. అందుకే రోజూ ఎక్కడో ఒక మూఢ నమ్మకాల బారిన పడుతున్న బాధితుల వ్యధలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి... తన కుటుంబ మూఢ నమ్మకాల కారణంగా చనిపోయాడు. మూడు రోజుల ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన జీవరాజ్ రాథోడ్ అనే వ్యక్తి విషం తాగాడు. ఓ చెరువు సమీపంలో పడిన ఉన్న బాధితుడి గురించి సమాచారం అందుకున్న అతడి కుటుంబసభ్యులు... అతడిని ఆస్పత్రికి బదులుగా ఓ గుడికి తీసుకెళ్లారు. గుడిలో అతడికి ఫుల్లుగా నీళ్లు తాగించారు. ఇలా చేయడం వల్ల బాధితుడి శరీరం నుంచి విషం బయటకు వెళ్లిపోతుందని వారి నమ్మకం.

గుడిలో నీళ్లు తాగిన తరువాత సాధారణ స్థితికి చేరుకున్న బాధితుడు జీవరాజ్... రెండు రోజుల తరువాత మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. బాధితుడు అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే జీవరాజ్ మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. రెండు రోజుల క్రితమే ఆస్పత్రికి తీసుకొచ్చి ఉంటే... బాధితుడు బతికేవాడని డాక్టర్లు అతడి కుటుంబసభ్యులకు స్పష్టం చేశారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... బాధితుడిని ముందుగా గుడికి ఎందుకు తీసుకెళ్లారనే దానిపై విచారణ చేపట్టారు.


First published: May 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...