హోమ్ /వార్తలు /క్రైమ్ /

Viral video: అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగివ్వలేదని ఏం చేశారో .. ఈ వీడియో చూడండి

Viral video: అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగివ్వలేదని ఏం చేశారో .. ఈ వీడియో చూడండి

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Viral video: అప్పు తీసుకున్న వ్యక్తి పట్ల అత్యంత అమానుషంగా, అమానవీయంగా ప్రవర్తించారు. డబ్బులు వసూలు చేసుకునేందుకు ఎన్నో మార్గాలు ఉంటే అవేమి కాదంటూ రౌడీల్లా ప్రవర్తించారు. ఏం చేశారో ఈవీడియో చూస్తే అర్ధమవుతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Odisha (Orissa), India

సోషల్ మీడియా(Social media)లో చక్కర్లు కొడుతున్న ఓ వీడియో (Video)చూస్తే ఎవరైనా సరే అప్పు తీసుకోవాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలని డిసైడ్ అవుతారు. మనుషుల్లో కూడా రాక్షసులు ఉంటారా అనే విధంగా కొందరు ప్రవర్తించారు. అప్పు తీసుకున్న వ్యక్తి పట్ల అత్యంత అమానుషంగా, అమానవీయంగా ప్రవర్తించారు. డబ్బులు వసూలు చేసుకునేందుకు ఎన్నో మార్గాలు ఉంటే అవేమి కాదంటూ రౌడీల్లా ప్రవర్తించారు. ఓ వ్యక్తిని హింసిస్తూ, అవమానిస్తూ రాక్షస ఆనందాన్ని పొందారు. అత్యంత దారుణంగా చూడాల్సిన ఈ ఘటన ఒడిశా(Odisha)లో జరిగింది. వీడియో మాత్రం దేశ వ్యాప్తంగా వైరల్ (Viral)అవుతోంది.

Viral video: ట్రైన్‌లో ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ .. ఏ రేంజ్‌లో జరిగిందో ఈవీడియో చూడండి

అప్పు వసూలు చేసే పద్దతిదేనా..

తప్పులు చేసిన వాళ్లను, నేరాలకు పాల్పడిన వాళ్లను పోలీసులు కూడా విధించనంత శిక్ష వేశారు ఇద్దరు వ్యక్తులు. కేవలం తమ దగ్గర డబ్బులు అప్పుగా తీసుకొని తిరిగి సమయానికి చెల్లించలేదనే కోపంతో అతడ్ని ఓ బానిసను చేశారు. వీధి రౌడీల కంటే దారుణంగా ప్రవర్తించి వార్తల్లోకి ఎక్కారు. ఒడిశాలోని కటక్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. తమ దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అతడి చేతులను తాళ్లసే వాటిని తమ టూ వీలర్స్ వెనుక కట్టుకొని నడి రోడ్డుపై లాక్కెళ్లారు.

మానవ రూప రాక్షసులు..

రుణం ఇచ్చిన వ్యక్తులు బైక్‌పై వెళ్తుంటే ...అప్పుగా డబ్బులు తీసుకున్న వ్యక్తి ఆ బైక్‌ల వెనుక కొన్ని కిలో మీటర్ల దూరం వరకు పరుగులు పెట్టాడు. నగరంలో నడిరోడ్డుపైన అందరూ చూస్తుండగా ఓ వ్యక్తిని ఈవిధంగా చిత్రహింసలకు గురి చేస్తున్న వీడియో హృదయ విదారకంగా ఉంది. అప్పు చేసిన వ్యక్తికి డబ్బులు ఇచ్చిన వాళ్లు వేసిన శిక్షను అమలు చేస్తుండగా రోడ్డుపైన ఉన్న కొందరు వీడియోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Helicopter crash: కుప్పకూలిన కేదార్‌నాథ్ యాత్రికుల్ని తీసుకెళ్తున్న హెలికాప్టర్ .. ప్రమాదంలో ఆరుగురు మృతి

వైరల్ అవుతున్న వీడియో..

ఇచ్చిన డబ్బు వసూలు చేసుకునేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రవర్తించిన తీరు అత్యంత నీచంగా ఉండటంతో వీడియో కాస్తా వైరల్ అయింది. చివరకు ఇదే వీడియో పోలీసుల వరకు చేరడంతో కటక్ పోలీసులు బైక్‌కు కట్టేసి పరిగెత్తించిన ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. వాళ్లను అదుపులోకి తీసుకొని పోలీస్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నామని ..నిందితులు ఎందుకు ఇంత కిరాతకంగా ప్రవర్తించారో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

First published:

Tags: Odisha, Trending news, Viral Video

ఉత్తమ కథలు