ఒక్క మెసేజ్ ఓపెన్ చేసినందుకు రూ.14 లక్షలు మూల్యం..

తమ వద్ద ఉన్న సొమ్ముతో ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్టు ఆ మెసేజ్ సారాంశం. ఈ మెసేజ్ దక్షిణకొరియాకు చెందిన పార్క్ గ్రీన్ గ్యాంగ్ నుంచి వచ్చినట్టు ఈ-మెయిల్ సైతం అందులో పేర్కొని ఉంది.

news18-telugu
Updated: July 4, 2020, 2:54 PM IST
ఒక్క మెసేజ్ ఓపెన్ చేసినందుకు రూ.14 లక్షలు మూల్యం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
స్మార్ట్ ఫోన్లలో అత్యాధునికత సాంకేతిక అందుబాటులోకి వచ్చింది. ఎంత దూరంలో ఉన్నవారినైనా క్షణాల్లో పలకరించగలుగుతున్నాం.. ఒకరినొకరు చూసుకోగలగడం.. గంటల తరబడి బ్యాంకుల వద్ద క్యూలైన్లలో వేచి ఉండకుండా క్షణాల్లో నగదు ట్రాన్స్‌ఫర్లు చేసుకోవడం.. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు స్మార్ట్ ఫోన్ ద్వారా పొందుతున్నాం. అదే సమయంలో స్మార్ట్ ఫోన్ వల్ల నష్టాలు లేకపోలేదు. క్షణాల వ్యవధిలో సైబర్ నేరగాళ్లు లక్షలు దోచుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఆ క్రమంలో ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల నుంచి తన ఫోన్‌కు వచ్చిన మెసేజ్ వల్ల ఏకంగా రూ.14 లక్షలు పొగొట్టుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ టోలిచౌకీ ప్రాంతానికి చెందిన మహ్మద్ సోహిబ్ మొబైల్‌కు ఓ మెసేజ్ వచ్చింది.

తమ వద్ద ఉన్న సొమ్ముతో ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్టు ఆ మెసేజ్ సారాంశం. ఈ మెసేజ్ దక్షిణకొరియాకు చెందిన పార్క్ గ్రీన్ గ్యాంగ్ నుంచి వచ్చినట్టు ఈ-మెయిల్ సైతం అందులో పేర్కొని ఉంది. దాన్ని ఓపెన్ చేసి చదివిన సోహిబ్ తన వివరాలను ఆ మెయిల్‌కు రిప్లై ఇస్తూ పంపించాడు. దీంతో సోహిబ్‌కి పది మిలయన్ డాలర్లు పంపుతున్నట్టు మెయిల్ వచ్చింది.

ఆ మెయిల్ వచ్చిన రెండు రోజులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి కస్టమ్స్ అధికారుల పేరుతో కొంతమంది ఫోన్ చేశారు. పార్శిల్‌లో డబ్బు వచ్చిందంటూ చెప్పి పలురకాల పన్నుల పేరుతో అతడి వద్ద నుంచి రూ.14 లక్షలు కాజేశారు. అనంతరం వారి వద్ద నుంచి ఏలాంటి సమాచారం లేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన సోహిబ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Narsimha Badhini
First published: July 4, 2020, 2:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading