కరోనా సోకిందని.. ఆస్పత్రిలో చేర్చుకోకపోవడంతో హుస్సేన్ సాగర్‌లో దూకిన వ్యక్తి..

గత పదిరోజులుగా పల్టుపాన్ జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నాడు. దీంతో స్థానికంగా ఉండే ఓ చిన్నపాటి క్లీనిక్‌లో వైద్యం తీసుకున్నాడు. అయినా తగ్గకపోవడంతో మలక్‌పేట్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించాడు.

news18-telugu
Updated: July 5, 2020, 2:58 PM IST
కరోనా సోకిందని.. ఆస్పత్రిలో చేర్చుకోకపోవడంతో హుస్సేన్ సాగర్‌లో దూకిన వ్యక్తి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ వ్యక్తి పది రోజులుగా జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలతో బాధపడుతున్నారు. స్థానికంగా ఉండే చిన్నపాటి క్లీనిక్‌లో చికిత్స పొందాడు. అయినా తగ్గకపోవడంతో దగ్గరలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. రెండు రోజులు తిరిగినా ఆస్పత్రిలో చేర్చుకోలేదు. ఈ క్రమంలోనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎక్కువ కావడంతో భయాందోళనతో హుస్సేన్ సాగర్‌లోకి దూకాడు. ఈ ఘటన హైదరాబాద్ మహానగరంలోని ట్యాంకుబండ్‌పై చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్‌కు చెందిన పల్టుపాన్(34) కొన్నేండ్ల క్రితం కుటుంబంతో కలిసి హైదరాబాద్ వచ్చి బతుకుదెరువు కోసం వచ్చి దూద్‌బౌలిలో స్థిరపడ్డాడు. స్థానికంగా గోల్డ్‌స్మిత్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే గత పదిరోజులుగా పల్టుపాన్ జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నాడు.

దీంతో స్థానికంగా ఉండే ఓ చిన్నపాటి క్లీనిక్‌లో వైద్యం తీసుకున్నాడు. అయినా తగ్గకపోవడంతో మలక్‌పేట్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించాడు. రెండు రోజులుగా ఆ హాస్పిటల్ చుట్టూ తిరిగినా బెడ్స్ ఖాళీగా లేవని చెప్పారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని చెప్పినా ఆస్పత్రి సిబ్బంది పల్టుపాన్‌ను చేర్చుకోలేదు. ఈ క్రమంలోనే శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది మరింత ఎక్కువ అవ్వడంతో పల్టుపాన్ భయాందోళనకు గురయ్యాడు.

తన స్నేహితుడు శ్రీరాములుకు ఫోన్ చేసి హుస్సేన్ సాగర్ వద్దకు తీసుకెళ్లాలని చెప్పాడు. దీంతో వారిద్దరూ రాత్రి 8 గంటల సమయంలో ట్యాంక్‌బండ్ మీదకు చేరుకున్నారు. అనంతరం శ్రీరాములును అక్కడు ఉంచి.. ఒక్కసారిగా పల్టుపాన్ ముందుకు వెళ్లి హుస్సేన్ సాగర్‌లో దూకేశాడు. పల్టుపాన్ నీటిలో దూకడాన్ని గమనించిన శ్రీరాములు రాంగోపాల్‌పేట పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినా పల్టుపాన్ ఆచూకీ దొరకలేదు.
Published by: Narsimha Badhini
First published: July 5, 2020, 2:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading