Home /News /crime /

PERSON BELONGS TO UGANDA CAME TO DELHI WITH NEARLY ONE KG OF COCAINE IN STOMACH AK

Drug Mafia: విదేశీయుడి కడుపులో 91 మాత్రలు.. బయటకు తీసిన డాక్టర్లు ఏం తేల్చారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Drugs Mafia: విమానాశ్రయంలోని టెర్మినల్ 3 వద్ద కొద్దిరోజుల క్రితం ఉగాండా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి శరీరంలో బయటి నుంచి వింత కదలిక వచ్చిందని కస్టమ్స్ అధికారులు అనుమానించారు.

    డ్రగ్స్‌ను అధికారులు, పోలీసుల కళ్లు గప్పి దేశాలు దాటించే ప్రయత్నాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు ఈ రకమైన డ్రగ్స్ రవాణా చేసే వారిని అధికారులు పట్టుకూనే ఉంటుంటారు. అయితే ఈ డ్రగ్ మాఫియాకు చెందిన నేరస్థులు మాత్రం వాటిని రవాణా చేసేందుకు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. ఓ కోలీవుడ్ సూపర్ హిట్ మూవీలో చూసినట్టుగా తాము డ్రగ్స్ సరఫరా చేసే దేశానికి వెళ్లడానికి ముందు ఏకంగా వాటిని మింగడం.. అక్కడికి వెళ్లిన తరువాత వాటిని ఆపరేషన్ లేదా ఇతర పద్ధతుల ద్వారా బయటకు తీయడం వంటివి చేస్తుంటారు. సేమ్ టు సేమ్ ఇదే రకంగా ఇండియాలోకి డ్రగ్స్ రవాణా చేసేందుకు ఉగాండాకు చెందిన ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఉగాండాకు చెందిన ఓ ప్రయాణికుడిని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు.

    విమానాశ్రయంలోని టెర్మినల్ 3 వద్ద కొద్దిరోజుల క్రితం ఉగాండా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి శరీరంలో బయటి నుంచి వింత కదలిక వచ్చిందని కస్టమ్స్ అధికారులు అనుమానించారు. గ్రీన్‌ ఛానల్‌ మీదుగా ఎయిర్‌పోర్టు ఎగ్జిట్‌ వద్దకు రాగానే కస్టమ్స్‌ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు 91 మత్తుమందు మాత్రలు మింగినట్లు అందులో తేలింది. వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్చారు. ఎక్స్-రేలో అతని పేగులు బుల్లెట్ల వంటి మాత్రలతో నిండిపోయింది. వాటిని బయటకు తీసే ప్రక్రియ నిపుణుల పర్యవేక్షణలో జరిగింది. ఈ క్రమంలో అతడి కడుపులో నుంచి 91 మాత్రలను స్వాధీనం చేసుకున్నారు.

    ఈ మొత్తం ప్రక్రియ చాలా రోజుల పాటు కొనసాగింది. ఈ 91 మాత్రల నుంచి 992 గ్రాముల తెల్లటి పొడిని గుర్తించారు. అధికారుల దర్యాప్తులో అది కొకైన్ అని తేలింది. దీంతో ఉగాండా నుంచి వచ్చిన ఆ ప్రయాణికుడు నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్ధాల చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించాడని అధికారులు తెలిపారు. అతడిని నేడు అరెస్ట్ చేశారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. కొంతకాలంగా ఢిల్లీలో స్మగ్లింగ్ కేసులు పెరిగిపోయాయి.

    ఇవి కూడా చదవండి

    తెలియని వ్యక్తితో డేటింగ్‌కు రెడీ.. ఓసారి వాడెవడో చూద్దామని గూగుల్లో సెర్చ్.. అంతే కాళ్ల కింద భూమి కంపించింది...

    Affair: భర్తను వదిలేసి మరొకరితో ప్రేమ.. కానీ అక్కడ కూడా తేడా కొట్టింది.. చివరికి

    గత నవంబర్‌లో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇద్దరు ఉగాండా జాతీయుల నుంచి 12.9 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరు మహిళలు కావడం గమనార్హం. వారి నుంచి రూ.90 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మహిళలు వైద్య పర్యాటకులుగా భారతదేశానికి వచ్చారని అధికారులు తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Crime news, Drugs case

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు