హోమ్ /వార్తలు /crime /

బాలికపై అత్యాచారం, హత్య..మాజీ ఎమ్మెల్యేకి పదేళ్లు జైలు

బాలికపై అత్యాచారం, హత్య..మాజీ ఎమ్మెల్యేకి పదేళ్లు జైలు

బాలికపై అత్యాచారారం, హత్యకు పాల్పడిన కేసులో డీఎంకే మాజీ ఎమ్మెల్యేకి 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ చెన్నైలోని ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

    తన ఇంట్లో పనిచేస్తున్న ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత హత్యకు పాల్పడిన కేసులో ఓ మాజీ ఎమ్మెల్యేకి చెన్నైలోని ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. పెరంబళూరు డీఎంకే మాజీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఇంట్లో పనిచేస్తూ వచ్చిన కేరళకు చెందిన 15 ఏళ్ల బాలిక 2012లో అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఆ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, మాజీ ఎమ్మెల్యే రాజ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత హతమార్చినట్లు పోస్ట్‌మార్టంలో తేలింది. దీంతో రాజ్ కుమార్‌తో పాటు అతని స్నేహితులు జయశంకర్, అన్బరసు, మహేంద్రన్, విజయ్ కుమార్, హరికృష్ణ, పన్నీర్ సెల్వంపై కిడ్నాప్, అత్యాచారం, హత్య తదితర పలు అభియోగాలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చెన్నైలోని ప్రత్యేక కోర్టు ఈ కేసును విచారించింది.

    ఈ కేసులో రాజ్ కుమార్‌తో పాటు అతని అనుచరుడు జయశంకర్‌కు పదేళ్లు జైలు శిక్ష, రూ.42 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శాంతి తీర్పు ఇచ్చారు. మిగిలిన నిందితుల్లో పన్నీర్ సెల్వం ఇప్పటికే మృతి చెందగా...మిగిలిన నలుగురు నిందితులపై అభియోగాలు నిర్ధారణ కాకపోవడంతో కేసు కొట్టారు.

    First published:

    ఉత్తమ కథలు