నల్లా నీళ్లు పట్టుకోవడంలో ఇద్దరు తోడికోడళ్ల గొడవ.. రణరంగంగా మారిన రెండు గ్రామాలు

ప్రతీకాత్మక చిత్రం

అర్ధరాత్రి సమయంలో నూతనకాలువకు చెందిన కొంతమంది వ్యక్తులతో కలిసి నక్కలదినెవడ్డిపల్లెలోకి రాత్రి 2 గంటల సమయంలో గొడవకు వెళ్లాడు. ఆ సమయంలో ఒకరిపై ఒకరురాళ్లు విసురుకున్నాడు.

  • Share this:


    ఓ ఇద్దరు తోడికోడళ్లు పెట్టుకున్న చిన్న గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. ఒక కుటుంబానికి చెందిన గొడవ కాస్త రెండు గ్రామాల మధ్య గొడవ మారింది. ఒకరిపై ఒకర రాళ్లు విసురుకోవడం.. ద్విచక్ర వాహనాలను తగలబెట్టుకోవడం వరకు వెళ్లింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేవీపల్లి మండలం నక్కలదినెవడ్డిపల్లేలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ ఇద్దరు తోడికోడళ్లు నల్లా విషయమై గొడవపడ్డారు. అందులో చిన్నకోడలు ఈ గొడవ విషయం మరో గ్రామం నూతనకాలువలోని తన అన్నకు చెప్పింది. దీంతో ఆ వ్యక్తి అర్ధరాత్రి సమయంలో నూతనకాలువకు చెందిన కొంతమంది వ్యక్తులతో కలిసి నక్కలదినెవడ్డిపల్లెలోకి రాత్రి 2 గంటల సమయంలో గొడవకు వెళ్లాడు. ఆ సమయంలో ఒకరిపై ఒకరురాళ్లు విసురుకున్నాడు.

    ఇది కాస్త రెండు గ్రామాలకు చెందిన ప్రజలకు మధ్య ఘర్షణ మారింది. ఆ క్రమంలో పలు కార్లను ధ్వంసం చేయడంతో పాటు బైకులను తగలబెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పీలేరు పోలీసులు గ్రామంలో గస్తీ ఏర్పాటు చేశారు. పలువురు గ్రామస్తులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
    Published by:Narsimha Badhini
    First published: