ఓ వ్యక్తి కళ్లముందే.. భార్య, ఐదు నెలల కొడుకు కన్నుమూశారు. చిన్నారికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకొని వచ్చి తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident in Peddapalli District) తల్లీబిడ్డ మృతిచెందారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాందం నెలకొంది. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో(Godavarikhani) మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గోదావరిఖని వన్ టౌన్ సీఐ రమేశ్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పుల అనిల్ కుమార్, రమ్య దంపతులు ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో నివాసం ఉంటున్నారు. అనిల్ కుమార్ నీటిపారుదల శాఖలో పనిచేస్తున్నాడు. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు నిర్వేద్ చంద్రకు ఐదు నెలలు. అయితే బాబుకు జ్వరం రావడంతో అనిల్ కుమార్, రమ్య దంపతులు గోదావరిఖనిలోని ఓ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అనంతరం స్కూటీపై ఇంటికి బయలుదేరారు. అయితే వీరి స్కూటీ రామగుండం నగరపాలక కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్ వద్దకు చేరుకున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.
గోదావరిఖని నుంచి ఎన్టీపీసీ వైపు వెళ్తున్న వీరి స్కూటీని వెనక నుంచి వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో స్కూటీపై అనిల్ కుమార్, రమ్య, వారి బాబు ముగ్గురు కిందపడిపోయారు. అయితే తీవ్రంగా గాయపడిన రమ్య, బాబు నిర్వేద్ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో అనిల్ కుమార్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. స్కూటీని ఢీకొన్న అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన బాధిత కుటుంబంలో అంతులేని శోకం మిగిల్చింది.
Nursing Student: నర్సింగ్ చదువుతున్న యువతి.. రాత్రి వేళ స్నానాల గదిలో షాకింగ్ సీన్.. అయ్యో పాపం..
ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు.
అమ్మ, నాన్న.. మా ఇంటికి రండి అని ఫోన్ చేసిన యువతి.. ఆ తర్వాత 15 నిమిషాలకే అల్లుడు ఫోన్ చేసి..
లోయలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..
పెద్దపల్లి జిల్లాలో (Peddapalli District) విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మంథని మండలం ఎక్లాస్‌పూర్‌లో ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బస్సు, కారు లోయలోకి దూసుకెళ్లాయి. బస్సులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. పరకాల డిపోకు చెందిన బస్సు బెల్లంపల్లి నుంచి హన్మకొండకు వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ ప్రయాణికులను మంథని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. వీరిలో ఒక వృద్ధురాలు పరిస్థితి విషమంగా ఉంది. బస్సులోని 16 మంది ప్రయాణికులు గాయపడినట్లు తెలిసింది. అయితే.. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం లేదు. కారు నడిపిన డ్రైవర్ పేరు వినీత్‌గా తెలిసింది. మంథని మండలం ఖాన్ సాయిపేట్ గ్రామానికి చెందిన మృతుడు వినీత్ మంథనిలో కార్ కేర్ సెంటర్‌లో మెకానిక్‌గా పని చేస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Peddapalli, Road accident