హోమ్ /వార్తలు /క్రైమ్ /

కరీంనగర్‌ కెనాల్‌లో తేలిన మరో కారు ... ఎమ్మెల్యే సోదరి కుటుంబంగా గుర్తింపు

కరీంనగర్‌ కెనాల్‌లో తేలిన మరో కారు ... ఎమ్మెల్యే సోదరి కుటుంబంగా గుర్తింపు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గతనెల 27 నుంచి ఈముగ్గురు కనిపించకుండా పోయారు. అయితే ఏదో ప్రాంతానికి పర్యటనకు వెళ్లి ఉంటారని అంతా భావించారు.

  కరీంనగర్ కెనాల్‌లో మరో కారు లభ్యమైంది. తిమ్మాపూర్ మండలం అలుగునూర్ కాకతీయ కెనాల్ లో ఓ కారు కొట్టుకు వచ్చింది. వెంటనే కారును బయటకు తీసిన పోలీసులు కారులో ముగ్గురు మృతదేహాల్ని కూడా గుర్తించారు. కారు నెంబర్‌‌ను ప్లేట్‌ను బట్టి ప్రమాదానికి గురైంది పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి కారుగా గుర్తించారు. కారులో కుళ్లిపోయిన స్థితిలో మూడు మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. ముగ్గురు కూడా ఎమ్మెల్యేసోదరి రాధిక, ఆమె భర్త సత్యనారాయణ, కుమార్తె సహస్రగా గుర్తించారు. గతనెల 27 నుంచి ఈముగ్గురు కనిపించకుండా పోయారు. అయితే ఏదో ప్రాంతానికి పర్యటనకు వెళ్లి ఉంటారని అంతా భావించారు. రాధిక టీచర్‌గా పనిచేస్తుంటే... సత్యానారయణ ఫెర్టిలైజర్ షాపును నడుపుతున్నారు. అయితే 27వ తేదీన కేరళకు వెళ్తున్నామని తెలిపినట్లు షాపు వర్కర్ చెప్పారు. అదే రోజు ఫోన్ కూడా రీఛార్జ్ చేయించుకున్నారు. అయితే 27వ తేదీ సాయంత్రం నుంచే ముగ్గురు ఫోన్లు స్విచ్ఛాప్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బంధువులు చెబుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కూడా తమ కుటుంబంలో  ఎలాంటి గొడవలు లేవన్నారు. సోదరి కుటుంబం తరచూ విహారయాత్రలకు వెళ్తుంటుందన్నారు. అలాగే... ఈసారి కూడా వెళ్లారని అంతా భావించామన్నారు. గతంలో సత్యనారాయణ కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.

  ఇవాళ ముగ్గురు మృతదేహాలు కారులో లభ్యమవ్వడంతో ఈ ఘటనపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. నిన్న సాయంత్రం కెనాల్లో ఓ బైక్ పడిపోయింది. ఈ ఘటనలో ఓ మహిళ కాలువలో పడిపోవడంతో వెంటనే కెనాల్‌లో నీటి సరఫరాను తగ్గించారు అధికారులు. ఈ ఘటనతో ఇవాళ గతనెల పడిపోయిన కారు పైకి తేలింది. కారులో ఉన్న ముగ్గురు మృతదేహాలు కుళ్లిపోయాయి. ఘటనాస్థలానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు... జిల్లా కలెక్టర్ , సీపీ కమలాసన్ రెడ్డి కూడా చేరుకున్నారు. అయితే ఈ ఘటనపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. అయితే గతనెల కేరళ వెళ్తున్నట్లు తన సోదరి తనకు తెలిపిందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. అలాంటి వాళ్లు ఇలా విగతజీవులుగా కనిపిస్తారని అనుకోలేదన్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం తమకు ఎలాంటి మిస్సింగ్ ఫిర్యాదు రాలేదన్నారు. ఘటనపై దర్యాప్తు చేప్టటారు. జరిగింది ప్రమాదమా.. లేక వేరే ఏదైనా కుట్ర కోణం దాగి ఉందన్న దానిపై ఆరా తీస్తున్నారు.

  Published by:Sulthana Begum Shaik
  First published:

  Tags: Car accident, Karimangar, Telangana

  ఉత్తమ కథలు