Home /News /crime /

PEDDAPALLI DISTRICT A YOUNG MAN WAS ATTACKED WITH A KNIFE DURING A FIGHT FOR MONEY IN AN ONLINE GAME SNR KNR

Peddapalli : ఆన్‌లైన్ గేమ్‌ పేరుతో దౌర్జన్యం .. డబ్బులు అడిగితే కత్తితో దాడి

(ఆటలో కత్తిపోట్లు)

(ఆటలో కత్తిపోట్లు)

Online Game: తెలంగాణలో ఆన్‌లైన్‌ గేమ్‌ చాపకింద నీరులా అన్నీ ప్రాంతాలకు పాకిపోయింది. గతంలో హైదరాబాద్‌కే పరిమితమైన ఈ ఆన్‌లైన్‌ గేమ్‌ ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో యువకుడిపై కత్తితో దాడి చేసే వరకు తీసుకొచ్చింది.

    (P.Srinivas,New18,Karimnagar)
    జూదం మహా చెడ్డదని పెద్దలు ఎప్పుడో చెప్పారు. కాని ఎవరూ వినరు కదా. ఒకసారి అనుభవమైతే కాని అర్ధం కాదు. అది ఆర్ధికంగా, మానసీకంగా, శారీరకంగా మనిషిని ఎంత నష్టపరుస్తుందో. పెద్దపల్లి జిల్లాలో ఆన్‌లైన్‌ గేమ్‌ విషయంలో తలెత్తిన వివాదం కత్తులు దూసుకునే వరకు వెళ్లింది. సీన్‌ అంతటితో ఆగలేదు. పంచాయితీ పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లింది. ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడిన పాపానికి ఓ వ్యక్తి ఆసుపత్రి పాలయ్యాడు. పెద్దపల్లి(Peddapalli)జిల్లా రామగుండం(Ramagundam)మున్సిపల్ కార్పొరేషన్(Municipal Corporation)పరిధిలో ఈ ఘటన జరిగింది. న్యూపీకే రామయ్య కాలనీ(New PK Ramayana Colony)లో ఆన్‌లైన్‌ గేమ్‌కి సంబంధించి ఇద్దరు వ్యక్తులు డబ్బుల విషయంలో గొడవపడ్డారు.

    ఆన్‌లైన్‌ గేమ్‌ అరాచకాలు ..
    మొదట మాట మాట అనుకున్నారు. ఆ తర్వాత అది కాస్తా ఘర్షణకు దారి తీసింది. రామయ్యకాలనీకి చెందిన ఇమ్రాన్‌ అనే యువకుడు ఆన్‌లైన్‌ గేమ్‌ ఏజెంట్‌గా వ్యవహరిస్తూ కాలనీకి చెందిన కొందరు యువకులతో మొబైల్‌లో ఆన్‌లైన్‌ గేమ్‌ నిర్వహిస్తున్నాడు. అదే కాలనీకి చెందిన మల్లేష్ అనే వ్యక్తి ఈ గేమ్‌లో పలుమార్లు పార్టిసిపేట్ చేశాడు. ఇమ్రాన్‌, మల్లేష్‌కి మధ్య ఆర్ధిక లావాదేవీలు ఉన్నాయి. తనకు రావాల్సిన నగదు విషయంలో మల్లేష్‌ ఇమ్రాన్‌ని అడిగాడు. డబ్బుల విషయంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం కాస్త ఘర్షణకు దారి తీయడంతో ఇమ్రాన్‌ తన చేతిలోని కత్తితో మల్లేష్‌ని గాయపరిచాడు. ఇంతలోనే అక్కడున్న స్థానికులు వెంటనే డయల్ 100కి ఫోన్‌ చేసి దాడికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు.

    నగదు విషయంలో ఘర్షణ..
    స్పాట్‌కి చేరుకున్న ఎన్టీపీసీ పోలీసులు కత్తిపోటుకు గురైన మల్లేష్‌ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు . ఈ ఘటనపై ఎన్‌టీపీసీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే కత్తితో గాయపరిచిన ఇమ్రాన్ అనే వ్యక్తిపై గతంలోనే ఎన్టిపిసి పోలీస్ స్టేషన్‌లో చాలా కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది.

    కత్తితో దాడి చేసిన ఏజెంట్ .,.
    కాలనీలో ఈ తరహా ఘటన జరగడంతో మరికొందరు యువకుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆన్‌లైన్‌ గేమ్స్‌కి పిల్లల్ని దూరంగా ఉండే విధంగా పోలీసులు అవగాహన కల్పించాలని కోరుకున్నారు. సెల్‌ఫోన్‌ల ద్వారా ఆన్‌లైన్‌ గేమ్ ఆడిస్తూ డబ్బుల కోసం ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని కాలనీలోని మరికొందరు యువకుల తల్లిదండ్రులు పోలీసుల్ని కోరుతున్నారు. ఇది బహిరంగ క్రీడ కాకపోవడంతో పోలీసులు ఈ విధంగా కాలనీల్లో గుట్టుచప్పుడు కాకుండా ఆన్‌లైన్‌లో సాగే గేమ్‌కి ఎలా అడ్డుకట్ట వేయాలా అని ఆలోచిస్తున్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Crime news, Peddapalli, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు