Saidharam Tej: సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన పవన్ కళ్యాణ్.. ఏమన్నారంటే..

ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్, ప్రమాదానికి గురైన సాయిధరమ్ తేజ్

Sai Dharam Tej: కొద్దిసేపటి క్రితం సాయిధరమ్ తేజ్ ప్రయాణిస్తున్న స్పోర్ట్స్‌ బైక్‌ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు

 • Share this:
  మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారని తెలిసిన వెంటనే మెగా ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. తమ అభిమాన హీరో పరిస్థితి ఎలా ఉందో అనే టెన్షన్ వారిలో కనిపిస్తోంది. విషయం తెలిసిన వెంటనే చాలామంది అభిమానులు సాయిధరమ్ తేజ్ చికిత్స పొందుతున్న మెడికవర్ ఆస్పత్రి దగ్గరకు చేరుకుంటున్నారు. సాయిధరమ్ తేజ్ మేనమామ, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఆస్పత్రికి చేరుకుని అతడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అతడి ఆరోగ్యం ఎలా ఉందనే అంశంపై మీడియా ప్రతినిధులు పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్.. సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారని సమాధానం ఇచ్చారు. అతడికి చికిత్స కొనసాగుతోందని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే మెగా ఫ్యామిలీ కుటుంబసభ్యులు ఒక్కొక్కరిగా ఆస్పత్రికి చేరుకుంటున్నారు. చిరంజీవి, అల్లు అరవింద్, అల్లు అర్జున్ సహా పలువురు ఆస్పత్రికి చేరుకుని సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను ఆరా తీస్తున్నారు.

  శుక్రవారం సాయి తేజ్ ప్రయాణిస్తున్న స్పోర్ట్స్‌ బైక్‌ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గరంలోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయితేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్‌తేజ్‌ను 108 సాయంతో సమీపంలోని మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. సాయిధరమ్‌ తేజ్‌ కుడికన్ను, ఛాతి భాగంలో తీవ్రగాయాలు అయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో హెల్మెట్ ఉన్నప్పటికీ సాయిధరమ్ తేజ్‌కు తీవ్ర గాయాలు అయినట్టుగా తెలుస్తోంది.

  Harish Rao: టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్‌ హరీశ్‌రావుకు వింత పరిస్థితి.. ప్లస్సా ? మైనస్సా ?

  Revanth Reddy: రేవంత్ రెడ్డిని నిరాశ పరిచిన రాహుల్ గాంధీ.. ఆ ప్లాన్ ఫలించలేదా ?

  ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు స్పందించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. బైక్‌ను నియంత్రించలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసినట్టుగా వెల్లడించారు. అయితే సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉందనే దానిపై వైద్యుల నుంచి అధికారిక హెల్త్ బులెటిన్ వెలువడాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితం మెడికవర్ ఆస్పత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం సాయిధరమ్ తేజ్‌ను జూబ్లీ హిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనకు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగిస్తున్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published: