Paul Dhinkaran: పాల్ దినకరన్ అనగానే… చాలా మందికి ఓ రకమైన గౌరవ భావం ఉంటుంది. ఓ వర్గం వారైతే ఆయన ప్రసంగాలు వింటూ దైవ చింతనలో మునిగితేలుతారు. జీసెస్ కాల్స్ మినిస్ట్రీ సంస్థకు హెడ్‌గా ఉంటూ... సువార్త, స్వస్థత అంటూ నీతులు చెప్పే ఆయన… తెరవెనక అక్రమంగా, అడ్డగోలుగా ఆస్తులు కూడబెట్టినట్లు బయటపడింది. తాజాగా ఆదాయపు పన్ను అధికారులు ఆయన ఇల్లు, ఆఫీసుల్లో దాడులు చేసి… 4.5 కేజీల బంగారంతోపాటూ రూ.120 కోట్ల లెక్కల్లోకి చూపని డబ్బు సీజ్ చేసినట్లు తెలిసింది. ఇది తెలిసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లూ మంచి వ్యక్తిలా కనిపించిన ఆయన అసలు స్వరూపం ఇదా అని ముక్కున వేలేసుకుంటున్నారు.
“పాల్ దినకరన్ ఇంట్లో బంగారం లభించింది” అని తెలిపిన ఓ ఆదాయపు పన్ను అధికారి తెలిపారు. ఇప్పుడు ఐటీ అధికారులు మరింత లోతుగా దాడులు చేయాలనుకుంటున్నారు. అమెరికా, బ్రిటన్, సింగపూర్, ఇజ్రాయెల్ సహా మొత్తం 12 దేశాల్లోని పాల్ దినకరన్ కంపెనీలు, ట్రస్టుల్లో తనిఖీలు చేయాలనుకుంటున్నారు. పాల్ దినకరన్ కి 200కి పైగా బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లు తెలిసింది.
ఇది కూడా చదవండి:Wrist lines palmistry: మీ చేతి రేఖల అర్థాలు తెలుసుకోండి
జనవరి 20న పాల్ దినకరన్‌కి సంబంధించిన ఆఫీసులు, ఇతర ఆస్తులపై ఐటీ అధికారులు దాడులు చేశారు. తమిళనాడు… కోయంబత్తూరులోని విద్యా సంస్థ, కారుణ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ పై దాడి చేశారు. దీనికి పాల్ దినకరన్ ఛాన్స్‌లర్‌గా ఉన్నారు. దాంతో ఆయనపై ఫోకస్ పెట్టారు అధికారులు. జీసెస్ కాల్స్ మినిస్ట్రీ సంస్థ… రకరకాల స్కీములు, ప్లాన్ల ద్వారా… ప్రజల నుంచి డొనేషన్లు సేకరిస్తోంది. ఇందుకోసం సొంత వైబ్ సైట్ ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ని ఉపయోగిస్తోంది.
Published by:Krishna Kumar N
First published:January 23, 2021, 12:59 IST