హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ఏటీఎంల్లో చోరీ.. ఇలాంటి దొంగ ఎక్కడా ఉండడు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ఏటీఎంల్లో చోరీ.. ఇలాంటి దొంగ ఎక్కడా ఉండడు

Bihar ATM Robbery Gang: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న కోరికను నెరవేర్చుకునేందుకు అతడు దొంగ అవతారమెత్తాడు. ఏటీఎంల్లో చోరీ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

Bihar ATM Robbery Gang: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న కోరికను నెరవేర్చుకునేందుకు అతడు దొంగ అవతారమెత్తాడు. ఏటీఎంల్లో చోరీ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

Bihar ATM Robbery Gang: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న కోరికను నెరవేర్చుకునేందుకు అతడు దొంగ అవతారమెత్తాడు. ఏటీఎంల్లో చోరీ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

  ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రజల్లో ఆదరణ అయినా ఉండాలి. లేదంటే కోట్లల్లో డబ్బైనా ఉండాలి. ఎవరు ఔనన్నా.. ఎవరు కాదన్నా.. ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తోంది.  ఇలాగే ఓ వ్యక్తి కూడా రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసి గెలవాలని కలలు కన్నాడు. ఐతే తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ఆయన ఏం చేశాడో తెలుసా..? దొంగలా మారాడు. అవును ఇది నిజం..! ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న కోరికను నెరవేర్చుకునేందుకు అతడు దొంగ అవతారమెత్తాడు. ఏటీఎంల్లో చోరీ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. బీహార్లో ఈ వెరైటీ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు.

  పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... పాట్నాకు చెందిన కౌశల్ చౌదరి అనే వ్యక్తి బాగా చదువుకున్నాడు. ఎంటెక్ పూర్తి చేశాడు. చదువు తర్వాత ఎవరైనా జాబ్ చేస్తారు. కానీ మనోడు అందరిలా కాదు. కాస్త డిఫరెంట్. అందుకే రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ ప్రజల్లో పలుకుబడి లేదు. పోనీ డబ్బైనా ఉందా..? అంటే అదీ లేదు. ఈ క్రమంలోనే ముందుగా డబ్బు సంపాదనపై దృష్టి పెట్టాడు. ఈజీగా డబ్బు వచ్చే పని ఏంటా..? అని ఆలోచిస్తూ.. దొంగతనాన్ని ఎంచుకున్నాడు. అసలుకే ఎంటెక్ తెలివి. తన టెక్నికల్ నాలెడ్జ్‌తో ఏటీఎం యంత్రాలను తెరిచి.. అందులో ఉన్న డబ్బును కాజేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకోసం యూట్యూబ్‌లో వీడియోలు చేసి ఏటీఎంను ఎలా తెరవాలో నేర్చుకున్నాడు కౌశల్ చౌదరి. ఆ తర్వాత గోపాల్‌గంజ్ ప్రాంతానికి చెందిన నగల వ్యాపారి సంతోష్ సోనీతో కలిసి గ్యాంగ్‌ ఏర్పాటు చేశాడు. ముందుగా ఏటీఎంను తెరిచేందుకు అవసరమైన పనిముట్లను సమకూర్చుకొని చోరీకి ప్రయత్నించారు.

  Teachers Affair: ఇద్దరు టీచర్ల మధ్య ఎఫైర్.. ఆమె ఫోన్లో సీక్రెట్ యాప్.. న్యూడ్ వీడియోలతో

  మొదట గత ఏడాది డిసెంబరు 15న పాట్నాలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ATMని ధ్వంసం చేసి డబ్బు కాజేసేందుకు ప్రయత్నించారు. జనవరి 27న కొత్వాలి పోలీస్ స్టేషన్ సమీపంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో కోసే ప్రయత్నం చేశారు. రెండు రోజుల తరువాత జనవరి 29న దిగాలో ఉన్న కోటక్ బ్యాంక్ యొక్క ATM ను పగలగొట్టి డబ్బు డ్రా చేయడానికి ప్రయత్నించారు. కానీ ఏ ఒక్కటీ సక్సెస్ కాలేదు. ఏటీఎం యంత్రాన్ని తెరవలేకపోయారు. అందులో నుంచి డబ్బులను కాజేయడంలో విజయం సాధించలేకపోయారు. ఐతే నగరంలో వరుసగా ఏటీఎంలు ధ్వంసమవుతున్న ఘటనలు జరుగుతుండడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే పక్కా సమాచారంతో దిఘా ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్‌పై దాడి చేశారు. కౌశల్‌తో పాటు సంతోష్‌ను కూడా అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు ముఠా సభ్యులు తప్పించుకున్నారు.

  AP Crime: ఆ విషయంలో భర్తలను ప్రోత్సహించిన భార్యలు.. విషయం తెలిసి షాక్ తిన్న పోలీసులు

  పోలీసులు వారి గది నుంచి ఏటీఎం బ్రేకింగ్ మిషన్‌తో పాటు ఇతర వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో డ్రిల్‌ మిషన్‌, వెల్డింగ్‌ మిషన్‌, ఏటీఎం పుల్లర్‌ రోప్‌, ఉలి, సుత్తి, గ్లోవ్‌, కత్తి వంటివి ఉన్నాయి. కోటక్ బ్యాంక్‌లో ఏటీఎం ధ్వంసం చేస్తున్న సమయంలో ఆ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. కౌశల్ గ్యాంగే ఈ తరహా ఘటనకు కారణమని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలోనే పక్కా సమాచారంతో పాటలీపుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని బీహార్‌కుంజ్ అపార్ట్‌మెంట్‌లో సోదాలు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

  First published:

  Tags: Bihar, Crime news, National News

  ఉత్తమ కథలు