Home /News /crime /

PATIENTS DEATH TRAGEDY FAMILY MEMBERS VANDALISE HOSPITAL AND INJURE 2 DOCTORS IN WEST BENGAL AT HOWRAH PAH

Attack on doctor: ఆస్పత్రిలో రోగి బంధువుల రచ్చ... ఇద్దరు డ్యూటీ డాక్టర్లపై పేషెంట్ బంధువుల దాడి..

డాక్టర్ పై దాడిచేసిన బాలుడు

డాక్టర్ పై దాడిచేసిన బాలుడు

West bengal:  తమ తండ్రికి డాక్టర్లు సరైన వైద్యం అందించలేదని రోగి కుమారుడు, వారి బంధువులు ఆస్పత్రిలో బీభత్సం సృష్టించారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేసి నానా రచ్చ చేశారు. అంతటితో ఆగకుండా ఏకంగా డ్యూటీలో ఉన్న డాక్టర్ లపైనే దాడికి పాల్పడ్డారు.

ఇంకా చదవండి ...
Patients death Tragedy In West bengal:  సాధారణంగా డాక్టర్లు తమ పేషేంట్ లకు సరైన వైద్యం అందిస్తారు. రోగి ప్రాణాలు కాపాడటానికి చివరి వరకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఒక్కొసారి, కొన్ని సందర్భాలలో రోగి ప్రాణాలు కొల్పోయిన సంఘటనలు తరచుగా వార్తలలో చూస్తునే ఉంటాం. దీంతో కొంత మంది రోగి తరపు బంధువులు రెచ్చిపోతుంటారు. ఆస్పత్రులపై భౌతిక దాడులకు తెగపడుతుంటారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేస్తుంటారు. ఒక్కొసారి డాక్టర్లపైన (Attack on doctor) కూడా దాడులకు పాల్పడుతుంటారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఒక్కొసారి రోగి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తాయి.

కొంత మంది లేని జబ్బు ఉన్నట్లు చెప్పి... అనవసర టెస్టులు అన్ని చేయిస్తారు. కొందరు డాక్టర్లు.. రోగి బంధువులను డబ్బుల కోసం పీడిస్తుంటారు. డాక్టర్లు కూడా అనైతికంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు వైద్యులు మాత్రం తమ వృత్తినే దైవంగా భావిస్తుంటారు. డబ్బుల కోసం ఆశపడక.. పెషేంట్ బతకడానికి తమవంతు కష్టపడుతుంటారు. ఇక్కడ పేషెంట్ బంధువులు తమ వారికి సరైన వైద్యం అందించలేదని ఆస్పత్రిపై దాడికి పాల్పడ్డారు.

పూర్తి వివరాలు.. పశ్చిమ బెంగాల్ లోని (West bengal) హౌరా జిల్లాలో పేషెంట్ బంధువులు ఆస్పత్రిలో బీభత్సం స్రుష్టించారు. తమ తండ్రి చనిపోవడానికి డాక్టర్లు నిర్లక్యంగా ప్రవర్తించారని, ఆస్పత్రిపై (Attack on Hospital) దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా రోగి కుమారుడు.. రోహిత్ ఆస్పత్రిలో నానా హాంగామా చేశాడు. హౌరాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో.. కార్తీక్ డేను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో.. అతను మూత్ర పిండాల వైఫల్యం కారణంగా గత శనివారం చనిపోయాడు.

దీంతో రోగి బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ తండ్రి మరణించాడని ఆరోపించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ ప్రమిత్ బసు, డాక్టర్ నబరున్ మజుందార్ల లపై దాడికి పాల్పడ్డారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వైద్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రోహిత్ ను అరెస్టు చేశారు. దీనిపై పశ్చిమ బెంగాల్ (West bengal) మంత్రి సీరియస్ అయ్యారు. వెంటనే ఘటనపై విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Attack, Crime news, West Bengal

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు