మహిళకు మత్తు మందిచ్చి.. నగ్న ఫొటోలు తీసి.. ఆపై అఘాయిత్యం చేసిన పాస్టర్..

ఓ పాస్టర్.. ప్రార్థనలు చేస్తాడని నమ్మి వచ్చిన మహిళకు మత్తు మందిచ్చి.. ఆపై నగ్నంగా ఫొటోలు తీశాడు. అంతటితో ఆగకుండా ఆ నగ్న ఫొటోలను చూపి బెదిరించి పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

news18-telugu
Updated: April 8, 2020, 2:56 PM IST
మహిళకు మత్తు మందిచ్చి.. నగ్న ఫొటోలు తీసి.. ఆపై అఘాయిత్యం చేసిన పాస్టర్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేవుడి పేరు చెప్పి మోసాలు, మాయలకు పాల్పడే వారి సంఖ్య రోజురోజూకీ పెరుగుతోంది. ఓ పాస్టర్.. ప్రార్థనలు చేస్తాడని నమ్మి వచ్చిన మహిళకు మత్తు మందిచ్చి.. ఆపై నగ్నంగా ఫొటోలు తీశాడు. అంతటితో ఆగకుండా ఆ నగ్న ఫొటోలను చూపి బెదిరించి పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన మచిలీపట్నంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నం చిలకలపూడికి చెందిన రాచర్ల జోయెల్ రాజుపేటలోని ఇమ్మానియేల్ గాస్పెల్ చర్చిలో పాస్టర్‌గా ఉంటున్నాడు. రాజుపేట గ్రామానికి చెందిన ఓ వివాహితతో జోయెల్ ప్రార్థనల పేరుతో పరిచయం పెంచుకున్నాడు.

ఈ క్రమంలో 2019 అక్టోబరు నెలలో సదరు వివాహితకు కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. ఆమె సృహ కోల్పోయాక మొబైల్‌తో అసభ్యకరంగా నగ్న చిత్రాలను తీశాడు. అనంతరం ఆ ఫొటోలను చూపించి కోరిక తీర్చాలని, లేకపోతే సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇటీవల అతడి వేధింపులు ఎక్కువ కావడంతో మానసికంగా కుంగిపోయింది. భార్య మానసికంగా ఇబ్బంది పడుతుండడాన్ని గమనించిన భర్త అనుమానంతో భార్యను నిలదీశాడు. దీంతో భార్య అసలు విషయం బయటపెట్టింది. పాస్టర్ రాచర్ల జోయెల్‌పై ఇనగుదురుపేట పోలీసు స్టేషన్‌లో తనను బెదిరించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
First published: April 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading