అమ్మాయిలకు లిప్ లాక్ పెట్టి దుష్టశక్తులను పారద్రోలుతున్న పాస్టర్... వీడియో వైరల్...

సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న కొంటె పాస్టర్ పనులు.. దెయ్యాలను వదిలించే వంకతో యువతులకు మూతి ముద్దులు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 25, 2019, 7:12 PM IST
అమ్మాయిలకు లిప్ లాక్ పెట్టి దుష్టశక్తులను పారద్రోలుతున్న పాస్టర్... వీడియో వైరల్...
అమ్మాయిలకు లిప్ లాక్ పెట్టి దుష్టశక్తులను పారద్రోలుతున్న పాస్టర్... వీడియో వైరల్... (Photo: twitter)
  • Share this:
ఈ మధ్యకాలంలో క్రైస్తవ మతాన్ని చుట్టుముట్టినన్ని వివాదాలు, మరే మతాన్ని దరిచేరలేదు. చర్చిల్లో నన్‌లపై జరుగుతున్న లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోయానని, నన్స్‌ను కేవలం ఓ సెక్స్ బానిసలుగా చూస్తున్నారని స్వయంగా క్రైస్తవ మతాధినేత పోప్ ఫ్రాన్సిస్ ఒప్పుకున్నాడు. కేవలం దేవుడికే జీవితాన్ని అంకితం చేసిన నన్‌లపైనే కాదు, చర్చిల్లో తమ గోడు వెల్లబుచ్చుకునేందుకు వచ్చిన వారిపై కూడా లైంగిక దాడికి పాల్పడుతున్నారు కొందరు పాస్టర్లు. తాజాగా చర్చికి వచ్చిన యువతులకు, ఓ కొంటె పాస్టర్ మూతి ముద్దులు ఇస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. క్రైస్తవులు అధికంగా ఉన్న దేశాల్లో జింబాబ్వే ఒకటి. జింబాబ్వేలో దుష్టశక్తులు, క్షుద్ర శక్తులంటే నమ్మకం ఎక్కువ. అతేంద్రియ శక్తులు ఉంటాయని, దెయ్యాలు, భూతాలు మనుషులను అవహిస్తాయని ఇక్కడి జనాల్లాగే జింబాబ్వే జనాలు కూడా విశ్వసిస్తారు. అలా దెయ్యం పట్టిందని చర్చికి తీసుకొచ్చిన యువతులకు మూతి ముద్దులు ఇస్తూ, చికిత్స చేస్తున్నాడో యంగ్ పాస్టర్.ఓ వ్యక్తి ఆ పాస్టర్ ముద్దుల దృశ్యాలను రికార్డు చేసి, సోషల్ మీడయాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా తెగ వైరల్ అవుతోంది. యువతులకు లిప్ లాక్ ఇచ్చిన తర్వాత పూనకంతో ఊగిపోతూ... మంత్రగాళ్లను గుర్తుకుతెచ్చాడు సదరు పాస్టర్.
First published: April 25, 2019, 7:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading