ఆంధ్రప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు జయప్రకాశ్ కాలనీలో ఓ పాస్టర్ ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు. వివరాలు.. తేళ్ల అపోలో అనే పాస్టర్ స్థానికంగా ఓ చిన్న రూమ్‌లో చర్చితో పాటు ట్యూషన్స్ నిర్వహిస్తున్నాడు. ట్యూషన్‌లు చెప్పడంతో పలువురు పిల్లలు అతని వద్దకు వచ్చేవారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు ఓ ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు. బాలికను బెదిరించిన పాస్టర్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఈ నెల 5వ తేదీన ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది.
అయితే కొన్ని రోజుల తర్వాత ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో అసలు విషయం వెలుగుచూసింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడు తేళ్ల అపోలోపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Ongole