లోదుస్తుల్లో బంగారం తీసుకొచ్చారు... అడ్డంగా బుక్కయ్యారు

ప్రయాణికులు లోదుస్తుల్లో, ప్రత్యేకంగా తయారు చేసిన జేబుల్లో బంగారాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని బంగారాన్ని సీజ్ చేశారు.

news18-telugu
Updated: May 9, 2019, 10:01 AM IST
లోదుస్తుల్లో బంగారం తీసుకొచ్చారు... అడ్డంగా బుక్కయ్యారు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
శంషాబాద్‌లో మరోసారి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి ఇండిగో విమానంలో వస్తున్న ఇద్దరు ప్రయాణికులపై అనుమాని వచ్చిన కస్టమ్స్ అధికారులు సోదాలు చేశారు. దీంతో వారికి షాక్ కలిగించే అంశాలు . ప్రయాణికులు లోదుస్తుల్లో, ప్రత్యేకంగా తయారు చేసిన జేబుల్లో బంగారాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని బంగారాన్ని సీజ్ చేశారు. దాదాపు మూడున్నర కిలోలకు పైగా గోల్డ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ కోటిరూపాయలకు పైగా ఉంటుందని తెలిపారు. ఇద్దరు ప్రయాణికులు తమ అదుపులో ఉన్నరన్నారు. ప్రయాణీకుడు తన లోదుస్తులకు ప్రత్యేకంగా జేబును అమర్చుకుని.. అందులో బంగారు బిస్కెట్లు తీసుకురాగా.. తనిఖీల్లో పట్టుబడ్డాడని తెలిపారు.

తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. రూ.3 కోట్ల విలువైన 33 బంగారం బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న థామస్ అనే ప్రయాణికుడి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారానికి సరైన లెక్కలు చూపకుండా అక్రమంగా తరలిస్తున్న థామస్ ను సీఐఎస్ఎఫ్ అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
First published: May 9, 2019, 10:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading