Foot over bridge collapses : మహారాష్ట్రలో(Maharashtra) విషాదం చోటు చేసుకుంది. నాగ్‌పూర్(Nagpur) సమీపంలోని బల్లార్షా రైల్వే స్టేషన్లోలోని పురాతన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి కుప్పకూలింది. కుప్పకూలిన సమయంలో ప్రయాణికులు ట్రాక్ దాటుతున్నట్లు సమాచారం. ఒక్కసారిగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్రీ కాస్ట్ స్టాబ్స్ కుప్పకూలడంతో 13-15 మంది ప్రయాణికులు పట్టాలపై పడిపోయారు. ఆ సమయంలో ఆ ట్రాక్‌లపై రైలు నడవలేదు. కాగా,ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ 60 అడుగుల ఎత్తులో ఉందని, ఇది చాలా పాతదని తెలుస్తోంది. ఇది ఒకటి, నాలుగు ప్లాట్‌ఫారమ్‌లను కలుపుతుంది.
కాగా, ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం 5.10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
#WATCH | Slabs fall off of a foot over bridge at Balharshah railway junction in Maharashtra's Chandrapur; people feared injured pic.twitter.com/5VT8ry3ybe
— ANI (@ANI) November 27, 2022
ఈ ఘటనలో గాయలపాలైనవారికి థమ చికిత్స అందించిన తర్వాత వారందరినీ సివిల్ ఆసుపత్రికి తరలించాం అని రైల్వే ప్రతినిధి శివాజీ సుతార్ తెలిపారు. తీవ్ర గాయాలపాలైన వారికి రూ. 1 లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50,000 పరిహారంగా రైల్వే ప్రకటించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Maharastra