గుంతకల్లు వద్ద నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ... ప్రయాణికుడ్ని కిందకు తోసి...

అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలోని తిమ్మనచర్ల రైల్వేస్టేషన్‌లో ఇవాళ ఉదయం జరిగింది.

news18-telugu
Updated: November 24, 2019, 2:55 PM IST
గుంతకల్లు వద్ద నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ... ప్రయాణికుడ్ని కిందకు తోసి...
Tirupati Special Train: తిరుపతి వెళ్లేవారికి శుభవార్త... రెండు ప్రత్యేక రైళ్లు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రైళ్లలో కూడా దొంగతనాలు దోపిడీలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రైళ్లలో ప్రయాణిస్తున్నవారి భద్రతకు అధికారులు భరోసా ఇవ్వలేకపోతున్నారు. తాజాగా గుర్తుతెలియని దుండగులు ఓ ప్రయాణికుడి నుంచి నగదు దోచుకుని కదిలే రైలు నుంచి కిందకు తోసేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలోని తిమ్మనచర్ల రైల్వేస్టేషన్‌లో ఇవాళ ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం హొస్పేటల్‌కు చెందిన గోవిందప్ప మంత్రాలయం వెళ్లేందుకు బెంగుళూరు నుంచి నాందేడ్‌కు వెళ్లే నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కారు.

రైలు తిమ్మనచర్ల రైల్వేస్టేషన్‌కు రాగానే గుర్తుతెలియని ముగ్గురు దుండగులు అతని వద్దనున్న రూ.50వేలు లాక్కొన్నారు. అంతటితో ఆగకుండా రైలులో నుంచి అతడ్ని కిందకు తోసేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని తిమ్మనచర్ల గ్రామస్థులు గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వైద్యులు ఈ సమాచారాన్ని రైల్వే పోలీసులకు అందజేశారు. గుంతకల్లు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
First published: November 24, 2019, 2:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading