హోమ్ /వార్తలు /క్రైమ్ /

Viral video: ట్రైన్‌లో ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ .. ఏ రేంజ్‌లో జరిగిందో ఈవీడియో చూడండి

Viral video: ట్రైన్‌లో ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ .. ఏ రేంజ్‌లో జరిగిందో ఈవీడియో చూడండి

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Viral video: రైల్లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఎవరూ ఊహించని స్థాయికి గొడవ చేరింది.తాను కూర్చున్న సీటుపై కాలు పెట్టాడనే కోపంతో మందలించడంతో మొదలైన గొడవ చివరకు రైలు కదులుతుండగానే యువకుడ్ని డోర్‌ నుంచి బయటకు బయటకు నెట్టేసిన సంఘటన సంచలనంగా మారింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • West Bengal, India

రైలు(Train)లో ప్రయాణం చేసే సమయంలో చిన్న చిన్న గొడవలు, తోటి ప్రయాణికులతో వాగ్వాదం జరగడం సర్వ సాదారణంగా చూస్తూనే ఉంటాం. కాని పశ్చిమబెంగాల్‌(West Bengal)లో రైల్లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఎవరూ ఊహించని స్థాయికి గొడవ చేరింది.తాను కూర్చున్న సీటుపై కాలు పెట్టాడనే కోపంతో మందలించడంతో మొదలైన గొడవ చివరకు రైలు కదులుతుండగానే యువకుడ్ని డోర్‌ నుంచి బయటకు బయటకు నెట్టేసిన సంఘటన సంచలనంగా మారింది. ట్రైన్‌లో ఇంతటి దారుణ సంఘటన జరుగుతుంటే అప్పర్ బెర్త్‌(Upper Berth)లో ఉన్న మరో ప్రయాణికుడు వీడియో(Video)తీసి సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేయండతో వైరల్(Viral)అవుతోంది.

Viral video: స్కూల్‌ బస్‌లో నక్కిన పైథాన్ .. ఎంత పెద్ద పామును పట్టుకున్నారో ఈ వీడియో చూడండి

సీటు మీదు కాలు పెట్టినందుకు..

ట్రైన్‌లో ప్రయాణాలు చేసే సమయంలో సర్ధుకుపోయే స్వభావం ముఖ్యం. సీటు కోసం, లేదంటే కాళ్లు తగలడం వంటివి జరుగుతుంటాయి. ఆ చిన్న వాటికే కోపంతో రగిలిపోయి అవతలి వ్యక్తులపై గొడవకు దిగడం ఎంత ప్రమాదకరమో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఓ సంఘటన ఉదాహరణగా నిలిచింది. బీర్భం పరిధిలో ట్రైన్‌లో ప్రయాణిస్తున్న వారిలో ఓ యువకుడు మరో వ్యక్తిని తిట్టాడు. ఆ మాటలు అవతలి వ్యక్తికి వినిపించడంతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాట, మాట పెరిగింది. తోపులాటకు దారి తీసింది. ఒకరినొకరు తోసుకున్నారు. తర్వాత సర్దుకుపోయారు.

కోపం ఆపుకోలేక ..

నడి వయసు కలిగిన వ్యక్తి గొడవ ముగిసిన తర్వాత వచ్చి తన సీటులో కూర్చున్నాడు. ఇంతలో అతనితో గొడవపడిన యువకుడు మళ్లీ వచ్చి సీటుపై కాలు పెట్టడంతో విసిగిపోయాడు. వెంటనే సీటులోంచి లేగిచి ..అతడ్ని రన్నింగ్‌లో ఉన్న ట్రైన్‌లోనే నెట్టుకొని డోర్ దగ్గరకు తోసుకుంటూ వెళ్లి బయటపడేశాడు. ఒక వ్యక్తిని నిర్ధాక్షిణ్యంగా ట్రైన్ లోంచి బయటకు నెట్టి వేసిన తర్వాత అతని ముఖంలో కనీసం బాధ, భయం కనిపించకపోగా..ఇంకా కోపంతో ఉండటాన్ని పైన కూర్చున్న వ్యక్తి గమనించి వీడియో తీశాడు.

Viral news: ఉద్యోగులకు కార్లు, బైక్‌లు పండుగ గిఫ్ట్‌గా ఇచ్చిన జ్యువెలరీ షాపు యజమాని .. ఎక్కడంటే

ట్రైన్‌ నుంచి గెంటేసిన వైనం..

ట్రైన్‌లో గొడవ పడుతున్న సమయంలో అప్పర్ బెర్త్‌లో కూర్చున్న వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో జరుగుతున్నదంతా షూట్ చేశాడు. ఆ వీడియోని ఫ్రెండ్స్ గ్రూప్‌తో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ట్రైన్‌లో జరిగిన ఘర్షణలో ఓ బయట పడిపోయిన వ్యక్తి ఎవరూ ..? అతను ఏమయ్యాడు..? .నెట్టేసిన వ్యక్తి ఎవరూ అనే విషయంపై రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు.

First published:

Tags: Trending news, Viral Video, West Bengal

ఉత్తమ కథలు