Plane Crash : ప్రయాణికులతో వెళ్తోన్న ఓ విమానం సరస్సులో కుప్పకూలింది(Passenger Plane Crash). ఆఫ్రికాలోని టాంజానియా(Tanzania)లో ఆదివారం ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 43మంది ఉండగా..19మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై టాంజానియా ప్రధానమంత్రి కాసిమ్ మజలివా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 19 మందికి సంతాపం తెలుపుతూ టాంజానియా వాసులు అందరూ మీ వెంటే ఉన్నారు అని బాధిత కుటుంబసభ్యులనుద్దేశించి మజలివా చెప్పారు.
ప్రెసిషన్ ఎయిర్ లైన్స్ కు చెందిన PW494 విమానం ఆదివారం ఉదయం టాంజానియా ఆర్థిక రాజధాని దార్ ఎస్ సలామ్ నుండి 43 మంది ప్రయాణికులతో బయల్దేరింది. బుకోబా నగరంలో ల్యాండ్ అవ్వాల్సిన కొద్ది సమయానికి ముందే ప్రతికూల వాతావరణం కారణంగా టాంజానియాలోని కగేరా ప్రాంతంలోని విక్టోరియా సరస్సులో కుప్పకూలిపోయింది. బుకోబా ఎయిర్ పోర్టులో ల్యాండయ్యే ప్రయత్నంలో ఎయిర్ పోర్టును ఆనుకుని ఉన్న సరస్సులో కూలిపోయింది. తోక భాగం మినహా విమానం మొత్తం సరస్సులో మునిగిపోయింది. సమాచారం అందిన వెంటనే అధికారులు రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. అధికారులు స్థానిక మత్స్యకారుల సాయంతో సహాయక చర్యలు కొనసాగించారు. ప్రమాద సమయంలో విమానంలో 43 మంది ఉన్నారు. వీరిలో 26 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.
A plane has crashed into Lake Victoria in Bukoba in Tanzania’s Kagera region. Rescue efforts are underway. The plane belongs to Precision Air. #Tanzania #Planecrash pic.twitter.com/1GItlItEoM
— Devesh (@Devesh81403955) November 6, 2022
US | TANA: న్యూయార్క్ కెండల్ పార్క్ ఫస్ట్ ఎయిడ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్ సిబ్బందికి "తానా"వస్తు సాయం
కెన్యా ఎయిర్వేస్ యాజమాన్యంలో ఉన్న ప్రెసిషన్ ఎయిర్ సంస్థను 1993లో స్థాపించారు. ఇది దేశీయంగా విమానాలను నడుపుతుంది. సెరెంగేటి నేషనల్ పార్క్, జాంజిబార్ వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు ప్రైవేట్ చార్టర్లను నడుపుతోంది. 2007లో కెన్యా ఎయిర్వేస్ విమానం ఐవరీ కోస్ట్ నగరం అబిజాన్ నుండి కెన్యా రాజధాని నైరోబీకి వస్తున్న సమయంలో కుప్పకూలి 114 మంది ప్రయాణికులు మరణించారు. అంతుకుముందు,2000లో అబిజాన్ నుండి నైరోబికి వెళ్లే మరో కెన్యా ఎయిర్వేస్ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలలే అట్లాంటిక్ మహాసముద్రంలో కూలి 169 మంది మరణించగా, 10 మంది ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. ఏడాది కిందట ఉత్తర టాంజానియాలో జరిగిన విమాన ప్రమాదంలో 10 మంది అమెరికా పర్యాటకులతో సహా ఒక డజను మంది మరణించారు. 2019 మార్చిలో అడిస్ అబాబా నుండి నైరోబీకి వెళ్లే ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలి 157 మంది మరణించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Plane Crash