Sad Incident: ఈ అమ్మాయి పేరు పూజ... రూపానికి తగ్గ గుణం.. కానీ ఇలా జరగడం...

పూజ (ఫైల్ ఫొటో)

చదువంటే ఆ అమ్మాయికి చాలా ఇష్టం. ఉన్నత చదువులు చదువుకుని జీవితంలో పైకి రావాలనుకుంది. అయితే.. ఆ యువతి తల్లిదండ్రులు.. ఇక చదివినంతవరకూ చాలని ఆమెకు చెప్పడంతో ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. తీవ్ర మనస్తాపం చెందిన ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

  • Share this:
    బళ్లారి: చదువంటే ఆ అమ్మాయికి చాలా ఇష్టం. ఉన్నత చదువులు చదువుకుని జీవితంలో పైకి రావాలనుకుంది. అయితే.. ఆ యువతి తల్లిదండ్రులు.. ఇక చదివినంతవరకూ చాలని ఆమెకు చెప్పడంతో ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. తీవ్ర మనస్తాపం చెందిన ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన కర్ణాటకలోని బళ్లారి పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బళ్లారి జిల్లా కూడ్లిగి తాలూకాలో ఉజ్జయిని అనే పల్లెటూరు ఉంది.

    ఆ ఊర్లో పూజ అనే 24 ఏళ్ల యువతి బీఈడీ ఫస్టియర్ చదువుతోంది. చదువంటే పూజకు ప్రాణం. చిన్నప్పటి నుంచి చదువు తప్ప వేరే ధ్యాస లేదు. అంత కష్టపడి చదువుకుని ఉత్తమ మార్కులు సాధించింది. ఊరిలో చదువు ప్రస్తావన వచ్చినప్పుడల్లా పూజ పేరు తప్పక వినిపించేంది. అంత ఇష్టంగా చదువుకునే పూజ ప్రస్తుతం బీఈడీ ఫస్టియర్ చదువుతోంది. పీహెచ్‌డీ చేయాలన్నది పూజ లక్ష్యం. అయితే.. తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. ఇక చదువులకు స్వస్తి చెప్పాలని పూజకు చెప్పారు.

    ఆడపిల్లకు పాతికేళ్లు వస్తున్నా పెళ్లి చేయకుండా ఇంకా చదువులేంటని, ఆ అమ్మాయికి పెళ్లయింది, ఈ అమ్మాయికి పెళ్లయిందంటూ బంధువులు అంటున్న మాటలతో పూజ తల్లిదండ్రులు కూడా ఆమెకు పెళ్లి చేయాలని భావించి సంబంధాలు చూస్తున్నారు. పాపం ఈ విషయం తెలియని పూజ ఇక ఉన్నత చదువులపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. తాను పీహెచ్‌డీ చేస్తానని.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులకు పూజ చెప్పింది. అయినా ఆమె తల్లిదండ్రులు కుదరదని.. ఇక చదువు ఆపేయాలని ఆమెకు చెప్పారు. ఈ పరిణామం పూజను తీవ్రంగా బాధించింది. చదువుకుని ఉన్నతంగా ఎదగాలని భావించిన తన కలలన్నీ కళ్ల ముందే నీరుగారిపోతుంటే చూసి తట్టుకోలేకపోయింది. కూతురి బాధ చూసినప్పటికీ.. బంధువులతో మాటలు పడలేక ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. ఆమెకు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు.

    ఇది కూడా చదవండి: Wife: భర్త గురించి పచ్చి నిజం తెలిసి.. ఇద్దరు పిల్లలతో కలిసి.. హైదరాబాద్ నుంచి ఎంత దూరం వెళ్లిందంటే..

    ఏ చదువునైతే పూజ అంతగా ఇష్టపడి బాగా చదువుకుందో ఆ చదువుకు దూరం కాబోతోందన్న ఆలోచనే పూజను కుదురుగా ఉండనివ్వలేదు. గత కొద్దిరోజులుగా జరిగిన పరిణామాలతో తీవ్ర మనస్తాపం చెందిన పూజ క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయం తీసుకుంది. బుధవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కూతురి మృతితో పూజ తల్లిదండ్రులు కుమిలిపోయారు. తమ కూతురు కోరుకున్నట్లు చదివించినా తమ కూతురు తమకు దక్కేదని గుండెలవిసేలా రోదించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదువుకోవడం కుదరదనే మనస్తాపంతోనే పూజ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
    Published by:Sambasiva Reddy
    First published: