హోమ్ /వార్తలు /క్రైమ్ /

కాళ్లా వేళ్లా పడ్డా కనికరించని కన్నవారు.. పురుగుల మందు తాగిన ప్రేమికులు.. ఆదిలాబాద్ లో దారుణం

కాళ్లా వేళ్లా పడ్డా కనికరించని కన్నవారు.. పురుగుల మందు తాగిన ప్రేమికులు.. ఆదిలాబాద్ లో దారుణం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తాను ప్రేమించిన అబ్బాయిని తప్ప వేరేవ్వరినీ చేసుకోనని ఆ అమ్మాయి చెప్పింది. సదరు అబ్బాయి కూడా తన ఇంటిలో ఇదే విషయాన్ని చెప్పాడు. ఎంత చెప్పినా ఆ తల్లిదండ్రుల మనసు కరుగలేదు. దీంతో వేరే వారిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక..

 • News18
 • Last Updated :

  వాళ్లిద్దరికీ చిన్ననాటి నుంచే పరిచయం. ఇద్దరిదీ ఒకే ఊరు. ఒకే కులం. ప్రేమించుకున్నారు. కలిసి బతకాలనుకున్నారు. అదే విషయాన్ని ఇంట్లో చెప్పారు. కానీ వారి తల్లిదండ్రులు ఎప్పటిలాగానే ఈ పెళ్లికి అడ్డు చెప్పారు. ఆ క్రమంలో తాను ప్రేమించిన అబ్బాయిని తప్ప వేరేవ్వరినీ చేసుకోనని ఆ అమ్మాయి చెప్పింది. సదరు అబ్బాయి కూడా తన ఇంటిలో ఇదే విషయాన్ని చెప్పాడు. ఎంత చెప్పినా ఆ తల్లిదండ్రుల మనసు కరుగలేదు. దీంతో వేరే వారిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక.. ప్రేమను వదులుకోలేక మనసులో కుమిలిపోయారు. కలిసి బతకకున్నా.. కలిసి చద్దామని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా.. పొలం దగ్గరికెళ్లి ఇద్దరూ పురుగుల మందు తాగారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.

  కుటుంబీకులు పెళ్ళికి అంగీకరించకపోవడంతో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని తలమడుగు మండలం దహెగావ్ గ్రామానికి చెందిన గోడం శ్రీరాం(25), గేడం సుజాత(19) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరిదీ ఒకే కులం కావడంతో పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ వారి పెళ్ళికి కుటుంబసభ్యులు అంగీకరించలేదు. దీంతో మనస్థాపం చెందిన ఆ ప్రేమ జంట.. కలిసి బ్రతకలేకపోయినా కలిసి చావాలనుకొని నిశ్చయించుకున్నారు. ఆపై ఊరి బయట ఉన్న పంటపొలం దగ్గరకు వెళ్లి.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ఒడిగట్టారు.

  నిన్న (సోమవారం) సాయంత్రం ఇంటి నుండి వెళ్ళిపోయిన ఆ ఇద్దరు... ఈ రోజు ఉదయం పంటపొలంలో పురుగుల మందు తాగి పడిపోయి గ్రామస్థులకు కనిపించారు. యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. కొన ఊపిరితో ఉన్న యువతిని గ్రామస్థులు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు తరలించారు. రిమ్స్ లో చికిత్స పొందుతూ యువతి కూడా మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Adilabad, Crime, Crime news, Lovers, Lovers suicide, Telangana, Telangana News

  ఉత్తమ కథలు