హోమ్ /వార్తలు /క్రైమ్ /

సోషల్ మీడియాలో చూసి..మళ్లీ బతికొస్తాడని ఉప్పులో మృతదేహం,చివరికి ఏమైందంటే

సోషల్ మీడియాలో చూసి..మళ్లీ బతికొస్తాడని ఉప్పులో మృతదేహం,చివరికి ఏమైందంటే

ఉప్పులో మృతదేహం

ఉప్పులో మృతదేహం

Dead Body In Salt To Alive : నీళ్లలో మునిగి చనిపోయిన వారిని మళ్లీ బ్రతికించాలంటే..ఒకటిన్నర క్వింటాల్ ఉప్పును మంచంగా ఉంచండి. మృతదేహాన్ని గుడ్డతో దానిపై గుడ్డతో పడుకోబెట్టండి. ఉప్పు శరీరంలోని నీటిని నెమ్మదిగా గ్రహిస్తుంది. దీంతో చనిపోయిన వ్యక్తి నెమ్మదిగా స్పృహలోకి వస్తాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Dead Body In Salt To Alive : మన సమాజంలో ఇంకా మూఢ నమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయన్న విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటక(Karnataka)లో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చూసి మూఢ నమ్మకంతో...నీటిలో మునిగి చనిపోయిన కుమారుడు బతికొస్తాడని ఉప్పులో కొన్ని గంటల పాటు మృతదేహాన్ని(Dead Body) ఉంచారు తల్లిదండ్రులు. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

అసలేం జరిగింది

కర్ణాటక(Karnataka)రాష్ట్రంలోని బళ్లారి జిల్లాలోని సిర్వార్(Sirwar)గ్రామానికి చెందిన సురేష్(Suresh) అనే 10 ఏళ్ల బాలుడు ఆదివారం(సెప్టెంబర్-4,2022)తన మిత్రులతో కలిసి దగ్గరలోని చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. అయితే లోతు ఎక్కువగా ఉండటం, ఈత సరిగ్గా రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. అనంతరం స్థానికులు చెరువు నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న వెంటనే బాలుడి పేరెంట్స్ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లారు. తనయుడి మృతదేహంపై పడి బోరున విలపించారు. ముద్దుగా పెంచుకున్న బిడ్డ భవిష్యత్‌లో ఉన్నత స్థానాలకు వెళ్తాడని కలలు కన్న తల్లిదండ్రులు(Parents)..తమ బిడ్డ తమ కళ్ల ముందు విగతజీవిగా పడి ఉండటం చూసి గుండెలవిసేలా రోదించారు. వారి వేదన చూసి అక్కడి స్థానికుల కళ్లలో కూడా నీటి చెమ్మ కనిపించింది. తమ బిడ్డను తిరిగి బ్రతికించుకుంటామంటూ ఆ తల్లిదండ్రులు చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇటీవల సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అయిన ఓ పోస్ట్ చూసిన బాలుడి తల్లిదండ్రులు అందులో పేర్కొన్న మాదిరి చేస్తే తమ బిడ్డ బతుకుతాడని భావించి.. ఐదు బస్తాల ఉప్పు తెచ్చి మృత దేహంపై పోశారు. ఆరు గంటలు గడిచినా బాలుడిలో చలనం లేదు, ప్రాణాలతో తిరిగి రాలేదు. కొంతమంది గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో గ్రామానికి చేరుకున్నారు పోలీసులు,డాక్టర్లు. బాలుడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్థారించారు. దీంతో ఆ తల్లిదండ్రులు తమ కుమారుడు తిరిగి రాడని గ్రామంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన  పోస్ట్ లో అసలేముంది

"నీళ్లలో మునిగి చనిపోయిన వారిని మళ్లీ బ్రతికించాలంటే..ఒకటిన్నర క్వింటాల్ ఉప్పును మంచంగా ఉంచండి. మృతదేహాన్ని గుడ్డతో దానిపై గుడ్డతో పడుకోబెట్టండి. ఉప్పు శరీరంలోని నీటిని నెమ్మదిగా గ్రహిస్తుంది. దీంతో చనిపోయిన వ్యక్తి నెమ్మదిగా స్పృహలోకి వస్తాడు. వ్యక్తికి స్పృహ వచ్చినప్పుడు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లండి. భగవంతుని దయ ఉంటే చనిపోయిన వారు కూడా బతుకుతారు. ప్రయత్నించడంలో తప్పు లేదు"అని కొద్ది రోజుల క్రితం ఓ పోస్ట్ ఫేస్ బుక్,వాట్సాప్ లలో వైరల్ అయింది. అయితే ఇది ఫేక్ అని తేలింది.

కమ్యూనిస్ట్ వ్యతిరేకి అని..ప్రతిష్టాత్మక అవార్డు తిరస్కరించిన మాజీ మంత్రి కేకే శైలజ!

డాక్టర్లు ఏమంటున్నారు

ఢిల్లీలోని AIIMSలోని ఫోరెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం... "ఒకసారి గుండె, మెదడు పనిచేయడం ఆగిపోయినప్పుడు వ్యక్తి చనిపోయినట్లు ప్రకటిస్తారు. ఉప్పు కుప్ప కింద శరీరాన్ని ఉంచడం ద్వారా శరీర కార్యకలాపాలు పునఃప్రారంభించబడవు. అయితే ఇలాంటి అబద్ధాలను నమ్మడం వెనుక సూడోసైన్స్ ఉందని హిస్టోపాథాలజీ హెడ్,ఎయిమ్స్ మార్చురీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ యాదవ్ చెప్పారు. చనిపోయిన వ్యక్తిని ఉప్పులో కప్పి బతికించేందుకు ప్రయత్నించిన ఘటనలు గతంలో చాలా నమోదయ్యాయని చెప్పారు. పైన పేర్కొన్న ఉప్పు చికిత్సకు శాస్త్రీయ సమర్థన లేదన్నారు. మరణించిన వారి బంధువులు మరణించిన వ్యక్తిని తిరిగి బ్రతికించాలనే మూఢ భావన కలిగి ఉంటారు... అందుకే అలాంటి ఆచారం పాటిస్తుంటారన్నారు. ఉప్పు శతాబ్దాలుగా సహజ సంరక్షణకారి....కానీ ఉప్పు చనిపోయినవారిని తిరిగి బ్రతికించదని నిర్ధారించబడిందని డాక్టర్ యాదవ్ చెప్పారు.

నీటిలో మునిగితే ఏమవుతుంది?

ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కోస్టల్ రీసెర్చ్ లాబొరేటరీ రీసెర్చ్ ప్రొఫెసర్ డా. జాన్ ఆర్. ఫ్లెట్‌మేయర్ ఆక్వాటిక్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్‌లో మునిగిపోవడం గురించి వివరించాడు.

నీటిలో మునిగిపోతున్న వ్యక్తి స్పృహ కోల్పోయినప్పుడు నీరు ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు కీలక అవయవాలకు ప్రాణవాయువు సరఫరా ఆగిపోతుందని ఆయన వివరించారు. శ్వాస ఆగిపోయినప్పుడు, గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ఒక్కసారి ఊపిరి, గుండె చప్పుడు ఆగిపోతే మనిషి జీవశాస్త్రపరంగా చనిపోయినట్లేనని అన్నారు.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రకారం 2015 లో భారతదేశంలో మొత్తం 29,822 మంది నీటిలో మునిగి చనిపోయారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Dead body, Karnataka, Salt

ఉత్తమ కథలు