HOME »NEWS »CRIME »parents killed their daughter in madanapalli chittoor district bk

Andhra Pradesh: మదనపల్లి యువతుల హత్య కేసులో షాకింగ్ విషయాలు! అర్ధ‌రాత్రి న‌గ్నంగా పూజ‌లు ఆపై హ‌త్య‌!

Andhra Pradesh: మదనపల్లి యువతుల హత్య కేసులో షాకింగ్ విషయాలు! అర్ధ‌రాత్రి న‌గ్నంగా పూజ‌లు ఆపై హ‌త్య‌!
మృతుల ఫ్యామిలీ ఫోటో

మ‌ద‌న‌ప‌ల్లి హ‌త్య కేసులో వెలుగులొకొస్తోన్న షాకింగ్ నిజాలు! హ‌త్య‌కు కార‌ణాలు తెలుసుకొని షాక్ అవుతున్న పోలీసులు. ఆదివారంతో క‌లియుగం అంత‌మైపోతుంద‌ని...సోమవారం ప్రారంభం కాబోయే స‌త్య యుగం రోజు త‌మ పిల్ల‌లు అతీత శ‌క్తుల‌తో తీరిగొస్తారిని క‌న్న కూతుర్ల‌ను దారుణంగా చంపేసిన త‌ల్లిదండ్రులు!

 • Share this:
  మానసిక స్థితి బాగోలేక, దేవుడు బ్రతికిస్తాడ‌నే పిచ్చి నమ్మకంతో కంటికి రెప్పలా కాపాడుకున్న ఇద్దరు పెళ్లీడుకొచ్చిన కూతుర్ల‌ను దారుణంగా చంపారు తల్లితండ్రులు. మదనపల్లె రురల్ మండలం లోని శివనగర్ లో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తోన్న క్ర‌మంలో ఆశ్చరాన్ని గొలిపే విష‌యాలు వెలుగులొకొచ్చాయి. ఒక పిచ్చి న‌మ్మ‌కంతో క‌న్న కూత‌ర్లునే హ‌త‌మార్చారు త‌ల్లిదండ్రులు.  రేపటితో కలియుగం అంతం అయ్యి... సత్య యుగం ప్రారం కానున్నదని, సత్య యుగంలో తన పిల్లలు లేచి నడుస్తారని వాళ్ల‌కి అతిత‌మైన శ‌క్తులు వ‌స్తాయ‌ని  పోలీసులతో వాగ్వాదానికి దిగింది మతిస్థిమితం లేని ఆ మహిళా. ఇంతకు ఆ ఇంట్లో ఎం జరిగింది....????

  అత్యున్నత విద్యను అభ్యసించిన విద్యావంతుల‌ కుటుంబం. మదనపల్లెలో పేరు ప్రఖ్యాతలు కలిగి...ప్రభుత్వ ఉమెన్స్ పాఠశాలలో ప్రినిసిపాల్ గా పనిచేస్తున్న పురుషోత్తం నాయుడు., ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న పద్మజ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె అలేఖ్య (27) ఎంబీఏ చదివింది. ఇక చిన్న కుమార్తె సాయి దివ్య (22) బిబిఎ పూర్తి చేసి సంగీతం నేర్చుకుంటోంది. కుటుంబంకు ఉన్న విపరీతమైన భక్తి భవనాలు కాస్త పిచ్చిగా మార్చాయేమో గాని రెండు కన్నా పేగు బంధాలను కడతేర్చారు ఆ తల్లితండ్రులు. గత వారం రోజులుగా ఉదయం వేకువజాము ఉదయం నుంచే ఇంటి నుంచి శబ్దాలు, పూజలు చేసే అలికిడి పొరుగు వారికీ  వినపడుతూ ఉండేదట. సాధారణ పూజలే అని స్థానికులు కూడా చూసి చూడనట్లు వెళ్తున్న పరిస్థితిలో...ఇలాంటి గోరమైన ఘటనకు పాల్పడ్డారు విద్యావంతులైన తల్లితండ్రులు. ఉదయం నుంచి వారి కుమార్తెలతో కలసి పూజలు ప్రారంభించిన పురుషోత్తం నాయుడు, పద్మజలు సాయంత్రం హత్యకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. కన్నా బిడ్డలపై ఎలాంటి మమకారం లేకుండా వివస్త్రాలను చేసి...ఆపై కలశాన్ని నోటిలో ఉంచి....తలపై వ్యాయామానికి ఉపయోగించే డబుల్ తో మోదీ చంపారు. ఇంటి నుంచి భారీగా కేకలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా...అక్కడకు చేరుకున్న పోలీసులకు కూడా  క‌ళ్లు బైర్లు కమ్మే దృశ్యాలు క‌నిపించాయి.  ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లిన పోలీస్ అధికారులు షాక్ నుంచి బయటకు వచ్చి పురుషోత్తం నాయుడు, పద్మజను ప్రశ్నించారు. మతి స్థిమితం లేని పద్మజ, పురుషోత్తం నాయుడులు గుండె నెవ్వేర‌ పోయే సమాధానాలు ఇవ్వడంతో పోలీసులకు మరో మరు షాక్ తప్పలేదు. తమ కుమార్తెలను తామే హత్యా చేసినట్లు పోలీసులకు తెలిపిన పద్మజ, ఆదివారంతో కలియుగం అంతం అయిపోతుందని., రేపు ప్రారంభం కాబోయే సత్య యుగంలో తమ కుమార్తెలు తిరిగి వస్తారని పోలీసులకు సమాధానం ఇచ్చింది. రేపటి వరకు టైం ఇవ్వాలని రేపు తమ ఇద్దరు కుమార్తులు తిరిగి న‌డుచుకుంటూ త‌మ ఇంటికి వ‌స్తార‌ని పోలీసుల‌తో వాద‌న‌కు దిగిన పద్మజ సమాధానాలకు విన్న పోలీసులు  పోలీసులు కంగుతిన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతామని మదనపల్లె డిఎస్పీ రవి మనోహర చారి స్పష్టం చేసారు. మానసిక స్థితి సరిగా లేకపోవడం....భక్తిని మించిన ఏదో తెలియని వేరొక నమ్మకాలు నమ్మి ఇద్దరు కుమార్తెలను కడతేర్చారని ఆయ‌న‌ తెలిపారు. ఇద్ద‌రు నిందితుల‌ను అదుపులోకి తీసుకొన్న‌మ‌ని తెలిపారాయ‌న‌.
  Published by:Balakrishna Medabayani
  First published:January 25, 2021, 09:03 IST

  टॉप स्टोरीज