Home /News /crime /

PARENTS KEPT HER 12 YEARS OLD DAUGHTER DEADBODY AT HOME FOR MORE THAN 2 MONTHS BELIEVING SHE WILL RETURN ALIVE SK

2 నెలలుగా ఇంట్లోనే కూతురు శవం.. పురుగులు పట్టి కంపు కొట్టినా.. బతుకుతుందని తల్లిదండ్రుల ఆశ

2 నెలలుగా ఇంట్లో కూతురు శవం.. పురుగులు పట్టి కంపు కొట్టినా.. బతుకుతుందని తల్లి ఆశ

2 నెలలుగా ఇంట్లో కూతురు శవం.. పురుగులు పట్టి కంపు కొట్టినా.. బతుకుతుందని తల్లి ఆశ

Indonesia: చూస్తుండగానే రెండు నెలలు గడిచిపోయాయి. ఆ బాలిక మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. పురుగులు పట్టి కంపు కొడుతోంది. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టు పక్కల వారికి అనుమానం వచ్చింది.

    తల్లిదండ్రులకు పిల్లలే సర్వస్వం. పిల్లల కోసం ఏమైనా చేస్తారు. ఏమడిగినా కాదనకుండా కొనిస్తారు. వారికి ఏదైనా జరిగితే మాత్రం అస్సలు తట్టుకోలేరు. తమ ప్రాణాలనైనా పట్టించుకోరేమో గానీ.. పిల్లలను కాపాడుకునేందుకు అన్నీ చేస్తారు. తమ ప్రాణాలను అడ్డేసైనా కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఒకవేళ ఎవరైనా తమ బిడ్డను కోల్పోతే ఆ బాధ వర్ణనాతీతం. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ.. కళ్ల ముందే శవమైతే.. ఆ షాక్ నుంచి కోలుకునేందుకు చాలా సమయం పడుతుంది. ఇండోనేసియాలో ఓ జంట కూడా తమ బిడ్డను కోల్పోయింది. తాము కనిపెంచి బిడ్డ.. తమ కళ్ల ముందే.. విగత జీవిగా పడి ఉండడాన్ని తట్టుకోలేకపోయారు. ఆ బాధలో వారు చేసిన పని.. సంచలనం సృష్టించింది. స్థానికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఎంతకి వారు ఏం చేశారో తెలుసా..?

    China: కరోనా అని అనుమానం వస్తే పెట్టెలో పెట్టేయడమే.. చైనాలో కఠిన చర్యలు

    ఇండోనేసియాలోని సెంట్రల్ జావాలోని పల్కరన్ గ్రామానికి చెందిన 14 బాలిక కొన్ని రోజుల క్రితం మరణించింది. టీబీతో బాధపడుతూ కన్నుమూసింది. ఆమెను బతికించుకునేందుకు తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేసినా.. అవి విఫలమయ్యాయి. బిడ్డను కాపాడుకోలేకపోయారు. తమ కూతురు మరణించిందన్న నిజాన్ని వారు నమ్మలేకపోయారు. అలాగే షాక్‌లో ఉండిపోయారు. అందుకే కూతురికి అంత్యక్రియలు కూడా నిర్వహించలేదు. ఎప్పటికైనా మళ్లీ బతుకుతుందని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కూతురు చనిపోయిన విషయాన్ని దాచిపెట్టారు. బయట ఎవరికీ చెప్పలేదు. కూతురి శవాన్ని ఇంట్లోనే పెట్టుకొని నిత్యం పూజలు చేసే వారు. ఆ పూజలతో తమ కూతురు మళ్లీ బతుకుతుందున్న గుడ్డి నమ్మకంతో ఉన్నారు.



    అఫ్ఘనిస్తాన్‌ని వెక్కిరిస్తున్న పేదరికం..అవయవాల్ని అమ్ముకుంటున్న ప్రజలు

    అలా చూస్తుండగానే రెండు నెలలు గడిచిపోయాయి. ఆ బాలిక మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. పురుగులు పట్టి కంపు కొడుతోంది. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టు పక్కల వారికి అనుమానం వచ్చింది. కొన్ని రోజులుగా బాలిక కనిపించకపోవడం.. ఇంటి నుంచి వాసన వస్తుండడంతో... ఏదో జరిగిందని భావించారు. ఈ క్రమంలోనే కొందరు స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూసి.. అక్కడున్న పరిస్థితిని చూసి షాక్ తిన్నారు. కుళ్లిపోయిన స్థితిలో బాలిక మృతదేహం లభించింది. ఇదేంటని అడిగితే.. తాము పూజలు చేస్తున్నామని, తమ కూతురు మళ్లీ బతికొస్తుందని సమాధానం చెప్పారు. వారిచ్చిన సమాధానంతో స్థానికులు షాక్ తిన్నారు. వెంటనే గ్రామ పెద్దలన పిలిపించి వారితో మాట్లాడారు. మీ కూతురు చనిపోయింది.. మళ్లీ తిరిగి రాదు.. మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకోవడ వల్ల ఆమె ఆత్మ శాంతించదని కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత అయిష్టంగానే కూతురికి అంత్యక్రియలను నిర్వహించడానికి ఒప్పుకున్నారు. ఎట్టకేలకు 2 నెలల తర్వాత తమ కూతురికి అంత్యక్రియలు నిర్వహించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Crime news, Indonesia, International, International news

    తదుపరి వార్తలు