PARENTS COMPLAIN ABOUT BOYFRIEND IN ABRUPT TURN IN CASE OF WOMAN COMMITTING SUICIDE A FEW DAYS AFTER GIVING BIRTH IN POONAMALLEE SSR
Married Woman: అసలు ఈ ఘటన గురించి తెలిశాక ఏం చెప్తాం.. ఈ ఇద్దరూ కలిసి చేసిన పని వల్ల..
ఆకాష్, కర్పగం (ఫైల్ ఫొటో)
ఈ ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు కర్పగం. తమిళంలో ‘కర్పగం’ అంటే మంచి బుద్ధి కలిగిన అని అర్థం. ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడి పేరు ఆకాష్ అలియాస్ గౌతమ్. ఈ ఇద్దరి పరిచయం చివరికి ఈమె నిండు ప్రాణం తీసింది.
చెన్నై: ఈ ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు కర్పగం. తమిళంలో ‘కర్పగం’ అంటే మంచి బుద్ధి కలిగిన అని అర్థం. ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడి పేరు ఆకాష్ అలియాస్ గౌతమ్. ఈ ఇద్దరి పరిచయం చివరికి ఈమె నిండు ప్రాణం తీసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని పూనమల్లీ ప్రాంతానికి చెందిన గోపీనాథ్(55) కూతురు కర్పగం (27). ఈమె ఐదేళ్ల క్రితం భర్తతో మనస్పర్థల కారణంగా అతనితో తెగతెంపులు చేసుకుంది. అప్పటి నుంచి తొమ్మిదేళ్ల వయసున్న కూతురితో కలిసి పుట్టింటికి వచ్చి ఉంటోంది. రెండేళ్ల క్రితం ఈమెకు ఆకాష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ కలిసి ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఆకాష్ కారణంగా గర్భం దాల్చిన కర్పగం గతేడాది డిసెంబర్ 21న పాపకు జన్మనిచ్చింది. అయితే.. ఆ పాపను తన బిడ్డగా ఆకాష్ అంగీకరించలేదు.
గంజాయికి పూర్తిగా బానిసగా మారిన ఆకాష్ ఆ పాప తన వల్ల పుట్టలేదని.. డీఎన్ఏ టెస్ట్ చేయించాలని కర్పగంకు తేల్చి చెప్పాడు. ఈ మాటలతో తీవ్ర మనస్తాపానికి లోనైన కర్పగం డిసెంబర్ 30న పుట్టింట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పూనమల్లీ పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కర్పగం తండ్రి గోపీనాథ్ తన కూతురి ఆత్మహత్యకు ఆకాషే కారణమంటూ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తన కూతురి సెల్ఫోన్లో ఉన్న వీడియోలు, కాల్ రికార్డింగ్ ఆడియో విన్న తర్వాత తనకు తెలిసిందని చెప్పాడు. అంతేకాదు.. కొన్నాళ్లుగా గంజాయికి బానిసైన ఆకాష్ కత్తులను చేత్తో తిప్పుతూ చేసిన వీడియోలు, గంజాయి తాగుతూ పొగలు వదులుతున్న వీడియోలను కూడా పోలీసులకు ఆధారాలుగా గోపీనాథ్ సమర్పించాడు. అంతేకాదు.. తన భర్త వ్యవహారశైలిపై తన కూతురు కర్పగం పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిందని.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విషయాన్ని తన సోదరుడికి కాల్ చేసి చెప్పుకుని బాధపడిందని గోపీనాథ్ చెప్పాడు.
ఇదిలా ఉండగా.. ఆకాష్ గంజాయి పీలుస్తూ పొగలు వదులుతున్న వీడియోతో పాటు, కత్తితో వీడియో చేసిన క్లిప్పింగ్స్‌ను బయటపెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాకుండా.. తన కూతురికి కొందరు రౌడీలు ఫోన్ చేసి తననూ, తొమ్మిదేళ్ల పాపను చంపేస్తామని బెదిరించారని.. ఆ కాల్ సంభాషణకు సంబంధించిన రికార్డింగ్స్ కూడా ఆమె ఫోన్లో ఉన్నాయని గోపీనాథ్ చెప్పాడు. పోలీసులు ఆకాష్‌ను అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని గోపీనాథ్ డిమాండ్ చేశాడు.
తన కూతురితో మోజు తీర్చుకుని బిడ్డతో తనకు ఏమాత్రం సంబంధం లేదని దారుణంగా మాట్లాడాడని.. ఆ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి లోనైన తన కూతురు చివరకు ఇలా ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని గోపీనాథ్ కన్నీరుమున్నీరయ్యాడు. ఆకాష్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, నెటిజన్ల నుంచి అతనిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ వస్తుండటంతో పోలీసులు కూడా ఈ కేసును సీరియస్‌గా తీసుకుని విచారిస్తున్నారు. ఇక్కడ.. శోచనీయమైన విషయం ఏంటంటే.. ఆకాష్, కర్పగం పరిచయం ఇద్దరు బిడ్డలకు తల్లిని దూరం చేసింది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.