• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • PARENTS AND VILLAGE PEOPLE ATTACKED ON SCHOOL TEACHER FOR HARASSING A 9TH CLASS GIRL IN PEDDAPALLI DISTRICT KNR

ముభావంగా ఉంటున్న కూతురు.. తల్లిదండ్రులు నిలదీస్తే చెప్పిందో దారుణ నిజం.. ఆ స్కూల్లో జరిగిన అసలు కథేంటంటే..

ముభావంగా ఉంటున్న కూతురు.. తల్లిదండ్రులు నిలదీస్తే చెప్పిందో దారుణ నిజం.. ఆ స్కూల్లో జరిగిన అసలు కథేంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ఓ తొమ్మిదో తరగతి విద్యార్థినికి ఫోన్ చేసి వేధింపులు మొదలు పెట్టాడో ఉపాధ్యాయుడు. ప్రైవేటు భాగాలను ఫొటోలు తీసి పంపించాలంటూ వేధించాడు. ఆ బాలిక తీవ్ర మనోవేదనతో తల్లిదండ్రులకు చెప్తే విషయం బయటపడింది.

  • Share this:
    విద్యబుద్దులు నేర్పించావలిసిన గురువులే నీచపు పనులకు ఒడిగడుతున్నారు. సభ్యసమాజం తల దించుకునే పరిస్థితి తెస్తున్నారు. సమాజంలో గౌరవ ప్రదమైన వృత్తిలో ఉండి అడ్డదాదారులు తొక్కుతున్నారు. విద్యార్థుల అవసరాలను, బలహీనతలను ఆసరాగా చేసుకొని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. శాఖా పరమైన విచారణ జరిగి వారి ఉద్యోగాలు కోల్పోయినా, మళ్లీ ఇలాంటి ఘటనలే పునరావృతమవతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఓ తొమ్మిదో తరగతి విద్యార్థినికి ఫోన్ చేసి వేధింపులు మొదలు పెట్టాడో ఉపాధ్యాయుడు. ప్రైవేటు భాగాలను ఫొటోలు తీసి పంపించాలంటూ వేధించాడు. ఆ బాలిక తీవ్ర మనోవేదనతో తల్లిదండ్రులకు చెప్తే విషయం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఈ విషయం తెలిసి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. పాఠశాలలో 9 వ తరగతి విద్యార్థినిని ఓ ఉపాధ్యాయుడు వ్యక్తిగత ఫోన్ నెంబర్ అడిగాడు. ఉపాధ్యాయుడు అడిగాడు కదా అని ఆ బాలిక అతడికి ఫోన్ నెంబర్ ను ఇచ్చింది. ఆ ఉపాధ్యాయుడు మాత్రం తన నీచ బుద్ధిని చూపించాడు. ఆ బాలికకు వీడియో కాల్ చేశాడు. ఆపై ఆమె ప్రైవేట్ భాగాలను చూపించాలని నిత్యం వేధింపులకు దిగాడు. తనకు సహకరిస్తే పరీక్షలన్నింటిలోనూ మార్కులు, ఇంకా డబ్బులు ఇస్తానని లేకుంటే 10 వ తరగతి కి పంపించడం కుదరదని భయబ్రాంతులకు గురి చేశాడు. ఆ వేధింపులు తాళలేక, ఏం చేయాలో తెలియక ఆ బాలిక మనో వేదనకు గురి అయింది. కొద్ది రోజులుగా కూతురు బాధపడుతున్న విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులకు ఏం జరిగిందని నిలదీశారు.
    ఇది కూడా చదవండి: మేడమీద గదిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. అర్ధరాత్రి అక్క అదృశ్యం.. తల్లిదండ్రులతో కలిసి ఆమె కోసం వెతుక్కుంటూ వెళ్తే..

    దీంతో జరిగిన సంఘటనను ఆ బాలిక తన తల్లిదండ్రులకు చెప్పి బోరున విలపించింది. కూతురి బాధను చూడలేక, జరిగింది తెలిసి ఆ తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. ఆ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో కలిసి ఉపాధ్యాయునిపై దాడి చేశారు. స్కూల్ లో ఉన్న చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్కూల్ కి వెళ్లి ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ విషయమై జిల్లా విద్యాశాఖాధికారులను వివరణ అడగ్గా, ఒకవేళ ఉపాధ్యాయుడు నీచపు పనులకు పాల్పడినట్టు తేలితే తప్పకుండ శాఖా పరమైన చర్యలు తీసుకోని. సస్పెండ్ కుడా చేస్తామని విద్యార్థిని తల్లి దండ్రులకు హామీ ఇచ్చారు.
    ఇది కూడా చదవండి: బీటెక్ కుర్రాడు.. డిగ్రీ యువతి.. రాత్రి 10.30గంటల సమయంలో పాల ప్యాకెట్ తీసుకొస్తానంటూ ఆ యువతి బయటకు వచ్చి..
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు