భార్య, మరదలు, అత్తను ఘోరంగా హత్య చేసి.. మృతదేహాలతో సెక్స్

ఇటీవల హరియాణా పాణిపట్టులో ముగ్గురు మహిళలు వరుసగా హత్యకు గురికావడ తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసును పోలీసుల చేధించారు. 

news18-telugu
Updated: September 25, 2020, 8:34 AM IST
భార్య, మరదలు, అత్తను ఘోరంగా హత్య చేసి.. మృతదేహాలతో సెక్స్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇటీవల హరియాణా పాణిపట్టులో ముగ్గురు మహిళలు వరుసగా హత్యకు గురికావడ తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసును పోలీసుల చేధించారు.  అయితే ఈ హత్యల వెనక ఉన్నది మరోవరే కాదని.. తొలుత హత్యకు గురైన మహిళ భర్తేనని పోలీసులు గుర్తించారు. నిందితుడు నూర్హాసన్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. నూర్హాసన్‌ భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడు సమల్కా ప్రాంతంలో అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు. అయితే భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానించాడు. అందుకు చెల్లలు మద్దతుగా నిలుస్తోందని అనుకున్నాడు. ఈ క్రమంలోనే భార్యపై ద్వేషం పెంచుకున్నాడు.

తొలుత భార్యను హత్య చేశాడు. అనంతరం సాక్ష్యాలను దాచడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. భార్య మ‌ృతదేహాన్ని తగలబెట్టేందకు యత్నించడంతో పాటుగా, ఆమె ముఖాన్ని గుర్తపట్టకుండా చేశాడు. అలా చేయడం ద్వారా హత్య కేసు నుంచి తప్పించుకోవచ్చని భావించాడు. ఆ తర్వాత భార్య మ‌ృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై పడేశాడు. ఆ తర్వాత నుర్హాసన్.. తన అత్త, మరదలు మనీషాలపై పదునైనా ఆయుధాలతో దాడి చేసి ఒకరి తర్వాత ఒకరిని హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాలపై రేప్‌కు పాల్పడ్డాడు. అనంతరం అత్త మ‌ృతదేహాన్ని తగలపెట్టి బుర్షామ్ గ్రామంలో కాలువ దగ్గర, మరదలి మృతదేహాన్ని మురుగు కాలువలో పడేశారు.

వరుసగా మూడు హత్యలు చోటుచేసుకోవడం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ క్రమంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. 75,000 రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. అన్ని కోణాలు విచారణ చేపట్టిన అధికారులు.. నిందితుడు నుర్హాసన్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో అతని నుంచి మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
Published by: Sumanth Kanukula
First published: September 25, 2020, 8:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading