పాకిస్థాన్‌‌లో సంచలనం...న్యూస్ యాంకర్‌ కాల్చివేత

న్యూస్ యాంకర్ మురీద్ అబ్బాస్‌ కాల్చివేతకు ఓ న్యూస్‌కు సంబంధించిన విభేదాలే కారణమని కథనాలు వెలువడగా...పోలీసులు దీన్ని తోసిపుచ్చారు. డబ్బుల విషయంలో ఓ వ్యక్తితో నెలకొన్న వ్యక్తిగత శత్రుత్వమే హత్యకు కారణమని తెలిపారు.

news18-telugu
Updated: July 10, 2019, 12:49 PM IST
పాకిస్థాన్‌‌లో సంచలనం...న్యూస్ యాంకర్‌ కాల్చివేత
మురీద్ అబ్బాస్(ఫైల్ ఫోటో)
  • Share this:
పాకిస్థాన్‌లో ఓ న్యూస్ యాంకర్ కాల్చివేత ఘటన సంచలనం సృష్టించింది. మురీద్ అబ్బాస్‌ కరాచీలోని బోల్ అనే న్యూస్ ఛానల్‌లో యాంకర్‌గా పని చేస్తున్నాడు. గత రాత్రి బులెటిన్ చదవి బయటకు వచ్చిన మురీద్ అబ్బాస్...కారులో ఇంటికి బయలుదేరాడు. ఆఫీస్‌కు సమీపంలోని ఓ కేఫ్ దగ్గర ఆగాడు. అక్కడకు వచ్చిన ఓ వ్యక్తి మురీద్‌తో వాగ్వివాదానికి దిగాడు. సదరు వ్యక్తి తనతో తెచ్చుకున్న తుపాకీతో మురీద్ అబ్బాస్‌‌పై కాల్పులు జరిపాడు. కేఫ్ సిబ్బంది మురీద్ అబ్బాస్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించగా...అప్పటికే మృతి చెందినట్లు జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్ డాక్టర్లు నిర్ధారించారు. మురీద్ ఛాతి, కడుపులోకి బుల్లెట్లు దూసుకెళ్లినట్లు తెలిపారు.

ఈ ఘటనలో మురీద్ అబ్బాస్‌ స్నేహితుడు ఖిజార్ హయత్ శరీరంలో రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఆస్పత్రిలో అతనికి చికిత్స కల్పిస్తున్నారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్యకు దారితీసిన కారణాలపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఓ న్యూస్‌కు సంబంధించి చెలరేగిన వివాదమే న్యూస్ యాంకర్ హత్యకు కారణమన్న కథనాలు వెలువడ్డాయి.

అయితే వ్యక్తిగత విభేదాలతోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఓ వ్యక్తితో మురీద్‌కు డబ్బుల విషయంలో విభేదాలు నెలకొననట్లు అతని స్నేహితుడు తమకు చెప్పాడని పోలీసులు తెలిపారు. అయితే మురీద్‌కు ఎవరితో వ్యక్తిగత విభేదాలు ఉన్నాయో పోలీసులు వెల్లడించలేదు.

First published: July 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>