భార్య ముక్కు కోసి, గుండు గీసిన భర్త.. అప్పటికీ కసి తీరక..

ఆమె మీద దాడి చేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఆర్తనాదాలు విన్న స్థానికులు వచ్చి ఆమెను కాపాడారు.

news18-telugu
Updated: September 18, 2019, 8:44 PM IST
భార్య ముక్కు కోసి, గుండు గీసిన భర్త.. అప్పటికీ కసి తీరక..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భార్యతో గొడవ పడిన ఓ భర్త ఆమె మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అందుకోసం ఏకంగా భార్య ముక్కు కోశాడు. అంతటితో అతడి కోపం చల్లారలేదు. ఆమెకు గుండు గీశాడు. పాకిస్తాన్‌లో ఈ ఘటన జరిగింది. లాహోర్‌లో నివసించే సజ్జద్ అహ్మద్, షాజియా తరచూ గొడవ పడుతూ ఉండేవారు. చేతికి అందిన దాంతో భార్య మీద దాడి చేసేవాడు. ఇనుప రాడ్లతో కూడా దాడి చేసేవాడు. కొన్ని కొన్ని సార్లు భర్త చేసే దాడిని తట్టుకోలేక ఆమె పొరుగింటికి పారిపోయేది. ఇరుగుపొరుగువారు అతడిని వారించి ఆమెను కాపాడేవారు. అయితే, తాజాగా భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో భర్త ఈసారి ఏకంగా ఆమె ముక్కు కోసేశాడు. ఆ తర్వాత కత్తి తీసుకుని ఆమెకు గుండు గీశాడు. ఆమె మీద దాడి చేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఆర్తనాదాలు విన్న స్థానికులు వచ్చి ఆమెను కాపాడారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

First published: September 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...