ఉగ్రవాద సంస్థలతో పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ భేటీ...భారత్‌లో విధ్వంసానికి కుట్రలు...

పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఇప్పటికే కాశ్మీర్ లోయలో అల్లకల్లోలం సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, మన భద్రతా దళాలు ఆ ప్రయత్నాలను తిప్పికొడుతున్నాయి. దీంతో భారత్ పై గతంలో మాదిరిగానే ఉగ్రదాడులకు దిగాలని ఐఎస్ఐ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

news18-telugu
Updated: September 10, 2019, 6:45 PM IST
ఉగ్రవాద సంస్థలతో పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ భేటీ...భారత్‌లో విధ్వంసానికి కుట్రలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆర్టికల్ 370 రద్దు అనంతరం పాకిస్థాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఎలాగైనా భారత్ లో అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లేలా చేయాలని పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకోసం నిషేధిత జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్, ఖలిస్థానీ జిందాబాద్ ఫోర్స్ తదితర సంస్థలతో ఐఎస్ఐ ప్రత్యేకంగా భేటీ అయినట్లు సమాచారం. భారత్‌లో ఉగ్రవాద దాడులే లక్ష్యంగా ఈ భేటీ జరిగినట్లు భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. భారత్‌లో అంతర్గత భద్రతపై సవాలు విసిరేందుకే ఐఎస్ఐ ఈ భేటీ నిర్వహించిందని సమాచారం. ఇదిలా ఉంటే భారత్ లో ఉగ్రవాద దాడులు చేసేందుకు తీవ్రవాద చొరబాట్లు జరిగే అవకాశం ఉందని, సముద్ర తీర ప్రాంతాల్లోని రాష్ట్రాలను ఇప్పటికే కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించాయి.

కాగా పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఇప్పటికే కాశ్మీర్ లోయలో అల్లకల్లోలం సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, మన భద్రతా దళాలు ఆ ప్రయత్నాలను తిప్పికొడుతున్నాయి. దీంతో భారత్ పై గతంలో మాదిరిగానే ఉగ్రదాడులకు దిగాలని ఐఎస్ఐ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థల ద్వారా భారత్ లోని ప్రధాన నగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.  దీంతో కేంద్ర హోం శాఖ ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని పోలీసులకు హెచ్చరికలు జారీ చేసింది.
Published by: Krishna Adithya
First published: September 10, 2019, 6:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading