PAKISTAN WOMAN TIKTOKER HAS ALLEGED THAT HER CLOTHES WERE TORN AND HUNDREDS OF PEOPLE WHO ALSO ASSAULTED HER ON THE OCCASION OF INDEPENDENCE DAY GH SRD
TikToker: మరీ ఇంత దారుణమా..! మహిళా టిక్‌టాకర్ దుస్తులు చింపేసి గాల్లోకి విసిరేసిన అల్లరిమూక..
ప్రతీకాత్మక చిత్రం
TikToker : బాధితురాలు, తన సహచరులు ఈ అల్లరిమూక బారినుంచి తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
దేశమంతా స్వతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్న వేళ.. ఒక మహిళా టిక్‌టాకర్‌ను కొందరు ఆకతాయిలు దారుణంగా హింసించారు. ఆమె దుస్తులు చింపేసి గాల్లోకి విసిరేసి మరీ రాక్షసానందం పొందారని మంగళవారం పలు వార్తాసంస్థలు వెల్లడించాయి. దీనికి సంబంధించి లారీ అడ్డా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఈ దారుణం పాకిస్థాన్‌లో స్వాతంత్య్ర దినోత్సవం రోజునే దారుణం జరిగింది. గత శనివారం పాక్ స్వాతంత్య్ర దినోత్సవం రోజున బాధితురాలు ఆరుగురు సహచరులతో కలిసి మినార్-ఇ-పాకిస్తాన్ సమీపంలో వీడియో తీసుకుంటున్నారని, ఆ సమయంలో 300 నుంచి 400 మంది అక్కడికి చేరుకొని బాధితురాలిపై దాడి చేశారని డాన్ వార్తాపత్రిక తెలిపింది.
బాధితురాలు, తన సహచరులు ఈ అల్లరిమూక బారినుంచి తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు తమపై దారుణంగా దాడి చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. " ఆ సమయంలో జనం భారీగా గూమిగూడారు. వారిలో కొంతమంది మా వైపు వచ్చారు. నా దుస్తులు లాగేసి, గాల్లోకి విసిరేశారు. వేధింపులకు పాల్పడ్డారు. చాలా మంది నాకు సహాయం చేయడానికి ప్రయత్నించారు. కానీ పెద్ద సంఖ్యలో ఉన్న ఆకతాయిలు నన్ను వేధించారు. నాతో ఉన్న మిత్రులపై కూడా దాడి చేశారు" అని బాధితురాలు తెలిపింది.
ఈ ఘటనకు సంబంధించి వందలాది మంది గుర్తు తెలియని వ్యక్తులపై లాహోర్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని గ్రేటర్ ఇక్బాల్ పార్క్ వద్ద మహిళ టిక్‌టాకర్, ఆమె సహచరులపై ఆకతాయిలు దాడి చేశారని తెలిపారు. ఆమె ఉంగరం, చెవిపోగులను బలవంతంగా తీసుకున్నారని, ఆమె సహచరులలో ఒకరి మొబైల్ ఫోన్, గుర్తింపు కార్డులు, రూ.15,000 లాక్కున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటనతో సంబంధం ఉన్న అనుమానితులను అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లాహోర్ డీఐజీ ఆపరేషన్స్ సాజిద్ కియానీ పోలీసు సిబ్బందిని ఆదేశించారు. మహిళల గౌరవానికి భంగం కలిగించేవారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.