హిందు యువతి... ముస్లిం యువకుడితో బలవంతంగా పెళ్లి... ఆ తర్వాత కీలక మలుపు

హిందు యువతి... ముస్లిం యువకుడితో బలవంతంగా పెళ్లి (ప్రతీకాత్మక చిత్రం)

అప్పుడప్పుడూ పోలీసులు తమ డ్యూటీకి మంచి మంచి పనులు చేస్తుంటారు. అలాంటి ఘటన ఒకటి జరిగింది. దీనిపై భారతీయులు... పాకిస్థాన్ పోలీసులను మెచ్చుకుంటున్నారు. ఎందుకో తెలుసుకోండి.

 • Share this:
  అది పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్. అక్కడ హిందు యువతి రీనా మెగ్వార్ (Reena Meghwar)ని ఓ ముస్లిం వ్యక్తి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత పోలీసులు... ఆమెను కాపాడి... ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. అసలేమైందంటే... రీనాను ఓ ముస్లిం యువతిగా చూపించేందుకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడు ఆ వ్యక్తి. బాదిన్ జిల్లాలో కోర్టు ఆమె ముస్లిం అయితే పెళ్లి చేసుకోవచ్చని తీర్పు ఇచ్చింది. అలా కోర్టును కూడా నమ్మించాడు. పెళ్లి జరిగిపోయింది. ఆ తర్వాత ఆ యువతి... ఓ వీడియోని రహస్యంగా రిలీజ్ చేసింది. తనను కాపాడమని సోషల్ మీడియాలో వేడుకుంది. అంతే... రీనా మెగ్వార్ వీడియో... వైరల్ అయ్యింది. కొన్ని రోజులుగా అది అలా వైరల్ అవుతూనే ఉంది.

  "ప్లీజ్ నన్ను నా తల్లిదండ్రుల దగ్గరకు పంపండి. నన్ను ఇక్కడికి బలవంతంగా తీసుకొచ్చారు. నేను ఎదురుతిరిగితే... నా తల్లిదండ్రులను, సోదరుణ్ని చంపుతామని బెదిరించారు" అని వీడియోలో కోరింది. తనను ఎవరు బంధించారో ఆ వివరాలు మాత్రం చెప్పలేదు.

  ఇటు ఇండియా, అటు పాకిస్థాన్‌లో హిందువులు దీనిపై తీవ్రంగా స్పందించారు. దాంతో... పాకిస్థాన్‌లోని సింధ్ ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వచ్చింది. ఈ వీడియో సంగతేంటో తేల్చండి అని పోలీసులను ఆదేశించింది. అంతే... పోలీసులు వేగంగా కదిలారు. వెంటనే బాదిన్ వెళ్లి... ఆమె ఎక్కడుందో కనిపెట్టి... అదుపులోకి తీసుకున్నారు. బాదిన్ స్థానిక కోర్టులో ఆమెను ప్రవేశపెట్టారు. అక్కడ జడ్జి "ఏమ్మా... నువ్వు ముస్లిమేగా" అని అడిగితే... "లేదండీ నేను హిందువుని..." అంటూ విషయం చెప్పి ఏడ్చేసింది. తన సోదరుడికి ప్రాణహాని ఉందని చెప్పింది.

  ఆమె మాటలు విన్నాక... కోర్టు... ఆమెకు రక్షణ కల్పించి... ఆ నిందితుడిని అరెస్టు చెయ్యమని ఆదేశించింది. ఆ తర్వాత ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు ఆమెకు, ఆమె కుటుంబానికీ రక్షణ కల్పించారు. తాజా అనుమానాల ప్రకారం... ఖాసిం ఖష్కేలీ అనే వ్యక్తి ఆమెను తీసుకుపోయినట్లు తెలిసింది.

  మరో కోణం:
  ఈ కేసులో అసలేం జరిగిందన్నది మరో కోణం. ఇంతకుముందు ఫిబ్రవరిలో రీనా మెగ్వార్‌ను ఖాసిం ఎత్తుకుపోయాడు. ఆ తర్వాత... ఆమె ముస్లిం అనీ... ఆమెను పెళ్లి చేసుకుంటాననీ, ఆమె పేరును మారియమ్‌గా మార్చుతానని అన్నాడు. అది నీకు ఇష్టమేనా అని కోర్టు ఆమెను అడిగితే... ఇష్టమే అని ఆమె చెప్పింది. దాంతో ఖాసింకి వ్యతిరేకంగా తల్లిదండ్రులు వేసిన కేసును కోర్టు కొట్టివేసింది. ఇంతకీ రీనా కోర్టులో పెళ్లి ఇష్టమేనని ఎందుకు చెప్పిందంటే... అలా చెప్పకపోతే... ఆమె తల్లిదండ్రులను, సోదరుణ్నీ చంపేస్తనని ఖాసిం బెదిరించాడు. దాంతో... ఆమె బలవంతంగా అలా చెప్పాల్సి వచ్చింది.

  ఇది కూడా చదవండి: Gympie: శపించే మొక్క!... ఆకుల్ని ముట్టుకుంటే ఆత్మహత్యే!

  పెళ్లి తర్వాత ఏప్రిల్‌లో సోషల్ మీడియాలోకి వచ్చిన వీడియోతో... అసలు విషయం బయటికి వచ్చింది. మరోసారి ఆమె తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లి జరిగింది చెప్పారు. ఇలా మొత్తానికి రీనా... తిరిగి పేరెంట్స్‌ని చేరగలిగింది.
  Published by:Krishna Kumar N
  First published: