హోమ్ /వార్తలు /క్రైమ్ /

ప్రెగ్నెంట్ మహిళపై దారుణం.. చెంపమీద కొడుతూ.. పొట్టపై తన్నుతూ.. వీడియో వైరల్..

ప్రెగ్నెంట్ మహిళపై దారుణం.. చెంపమీద కొడుతూ.. పొట్టపై తన్నుతూ.. వీడియో వైరల్..

మహిళపై దాడి చేస్తున్న గార్డులు

మహిళపై దాడి చేస్తున్న గార్డులు

Pakistan: మహిళ స్థానికంగా ఉన్న ఒక అపార్ట్ మెంట్ లో పనిచేస్తుంది. ఆమెకు ఆహారం అందివ్వడానికి ఆమె కొడుకు వచ్చాడు. అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Rajasthan, India

పాకిస్థాన్ లో (Pakistan) అమానవీయకర సంఘటన జరిగింది. ఒక మహిళ అపార్ట్ మెంట్ లో పనిమనిషిగా పనిచేస్తుంది. ఆమె ప్రెగ్నెంట్. ఈ క్రమంలో ఆమెకు, ఇంట్లో వారు తినడానికి టిఫిన్ బాక్స్ తీసుకొని వచ్చారు. కానీ అక్కడ ఉన్న సెక్యురిటీ సిబ్బంది లోపలికి రానివ్వలేదు. అంతటితో ఆగకుండా.. అతడి పట్ల దురుసుగా ప్రవర్తించాడు.దీంతో మహిళా తానే బయటకు వచ్చింది. అప్పుడు దారుణ ఘటన జరిగింది.

పూర్తి వివరాలు.. సనా అనే మహిళ.. కరాచీలోని గులిస్తాన్-ఎ-జౌహర్ బ్లాక్ 17లో ఉన్న నోమన్ గ్రాండ్ సిటీలోని అపార్ట్‌మెంట్ భవనంలో పనిచేస్తుంది. ఆమె ఐదునెలల ప్రెగ్నెంట్. అయితే.. ఆమె కోసం ఇంటి నుంచి టిఫిన్ క్యారెజ్ వచ్చింది. అప్పుడు సమయంలో తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఆమె కొడుకు సోహైల్ ఆహారం ఇచ్చివెళ్దామని వచ్చాడు. అప్పుడు సెక్యురిటీ సిబ్బందితో వాగ్వాదం జరిగింది. యువకుడిని లోనికి రానివ్వలేదు. అంతే కాకుండా.. బయటకు వెళ్లడానికి ప్రయత్నించిన సనా తో వాగ్వాదానికి దిగారు.


అంతే కాకుండా.. సెక్యురిటీ గార్డు ఆమెను (Pakistan security guard slaps) కొడుతూ.. పొట్టపై కాలితో తన్నుతూ విచక్షణ రహితంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోనికి వెళ్లిపోయింది. ఈ ఘటన ఆగస్టు 5న జరిగింది. ఆ తర్వాత.. మహిళ ఘటన పట్ల జరిగిన దారుణాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా (viral video)  మారింది. అబ్దుల్ నాసిర్, ఆదిల్ ఖాన్, మహమూద్ ఖలీల్ .. ఘటనకు పాల్పడినట్లుగా గుర్తించారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు సీరియస్ అయ్యారు.

అది కాస్త సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా వరకు వెళ్లింది. దీనిపై విచారణ జరిపి.. గార్డులపై కఠిన చర్యలు తీసుకొవాలని ఆదేశించారు. ఒక నివేదిక ప్రకారం.. పాక్ లో.. ఒక్క జూన్ నెలలోనే... మొత్తం 157 మంది మహిళలు కిడ్నాప్‌కు గురయ్యారు. 112 మంది మహిళలు భౌతిక దాడికి గురికాగా 91 మంది మహిళలు పాకిస్తాన్‌లో అత్యాచారానికి గురయ్యారని సమాచారం.

First published:

Tags: Crime news, Pakistan, Viral Video

ఉత్తమ కథలు