Rape: రేప్ చేస్తే...కెమికల్స్ చల్లి వృషణాలు తొలగించి...పాకిస్థాన్‌లో కొత్త శిక్ష...

అత్యాచార కేసులో దోషిగా తేలిన వారిని బహిరంగంగా ఉరితీయాలి లేదా రసాయనిక పద్దతిలో రేప్ కు పాల్పడినవారి వృషణాలు పనిచేయకుండా చేయాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు నిపుణులు సూచిస్తున్నాను.

news18-telugu
Updated: September 15, 2020, 7:13 PM IST
Rape: రేప్ చేస్తే...కెమికల్స్ చల్లి వృషణాలు తొలగించి...పాకిస్థాన్‌లో కొత్త శిక్ష...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పాకిస్తాన్లోని లాహోర్ ప్రధాన రహదారిపై ఇటీవల ఒక మహిళను ఇద్దరు వ్యక్తులు దారుణంగా రేప్ చేశారు. ఇద్దరు పిల్లలతో కలిసి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్న మహిళలను తన కారు నుండి బయటకు లాగి గన్ పాయింట్ వద్ద ఆమెపై అత్యాచారం చేశారు. ఈ ఘటన పాకిస్థాన్లో పెను సంచలనంగా మారింది. యావత్ దేశంలో ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రేపిస్టులను కఠినంగా శిక్షించాలని అనేక డిమాండ్లు వస్తున్నాయి.  ఈ దిగ్భ్రాంతికరమైన దాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. కాగా ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ‘‘అత్యాచార కేసులో దోషిగా తేలిన వారిని బహిరంగంగా ఉరితీయాలి లేదా రసాయనిక పద్దతిలో రేప్ కు పాల్పడినవారి వృషణాలు పనిచేయకుండా చేయాలని సూచిస్తున్నాను.

అయితే యూరోపియన్ యూనియన్ నుంచి ప్రత్యేక వాణిజ్య హోదా పొందింనందున పాకిస్థాన్లో రేపిస్టులను ఉరి తీయడం చాలా కష్టమైన పని. వారిని ఉరి తీయడం వల్ల ఆ హోదాకు హాని కలుగుతుంది. ఆ చర్య పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరంగా ఉంటుంది.  అందువల్ల వారిని కెమికల్ కాస్ట్రేషన్ చర్య ద్వారా శిక్షించడాన్ని పరిశీలిస్తున్నాం”అని అన్నారు. అలాగే అత్యాచారాలకు పాల్పడిన వారికి ఫస్ట్ డిగ్రీ అమలు చేయాలని సూచించారు. ఈ ఫస్ట్ డిగ్రీ ద్వారా కెమికల్ కాస్ట్రేషన్ చేసి మగతనాన్ని తగ్గించి మళ్లీ జీవితంలో లైంగిక కార్యకలాపాలకు పనికిరాకుండా చేయాలని ఆదేశించారు. తాజాగా ఈ ఘటనపై లాహోర్ కమిషనర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఘటనపై లాహోర్ కమిషనర్ ఉమర్ షేక్ స్పందిస్తూ చీకటి పడుతుండగా మహిళ ఒంటరిగా డ్రైవింగ్ చేయడం ఏంటి బుద్దిలేని పని అంటూ వ్యాఖ్యానించాడు.

దీంతో ఈ వ్యాఖ్యలపై అక్కడి మహిళలు తీవ్ర నిరసనకు దిగడంతో సిటీ కమిషనర్ పై ఖాన్ ప్రభుత్వం మండిపడింది. ఈ అత్యాచారం కేసులో ఇద్దరు ప్రధాన నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. నిందితుడు నేరానికి అంగీకరించినట్లు పాకిస్తాన్ అధికారులు ప్రకటించారు. డీఎన్ఏ రిపోర్ట్ కూడా మ్యాచ్ అయ్యిందని అధికారులు తెలిపారు.

రెండవ నిందితుడి కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతోంది. దాడి జరిగినప్పుడు సైట్ వద్ద ఉన్న వ్యక్తులను గుర్తించడానికి సెల్యులార్ ఫోన్ నెట్ వర్క్ నుండి జీపీఎస్ డేటాను ఉపయోగించారు. లైంగిక వేధింపులకు పాల్పడినవారిని బహిరంగంగా ఉరి తీయడంపై ఈ ఫిబ్రవరిలో చట్టసభలో బిల్ని ప్రవేశపెట్టారు, కాని ఆ చట్టం ఆమోదించబడలేదు.
Published by: Krishna Adithya
First published: September 15, 2020, 7:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading