దారుణం: పోలీసులే లక్ష్యంగా బాంబు దాడి.. 9 మంది దుర్మరణం

ఈ పేలుళ్లలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు.

news18-telugu
Updated: May 8, 2019, 12:14 PM IST
దారుణం: పోలీసులే లక్ష్యంగా బాంబు దాడి.. 9 మంది దుర్మరణం
దాడిలో ధ్వంసమైన వాహనం (Image :Reuters)
  • Share this:
పాకిస్థాన్లోని లాహోర్ లో మరోసారి బాంబు కలకలం రేగింది. లాహోర్‌లోని డేటా దర్బార్ అనే ఓ దర్గా వద్ద ఈ రోజు ఉదయం బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని దుండగులు ఈ దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. దీనిపై స్థానిక పోలీస్ మొహమ్మద్ కసీఫ్ మాట్లాడుతూ.. భద్రతా దళాల లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని భావిస్తున్నామని అన్నారు. దీనిపై దర్యాప్తును చేస్తున్నామని వెల్లడించారు. బాంబు పేలుడు ధాటికి రెండు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టామని, మృతదేహాలను పోస్ట్‌మార్టానికి ఆస్పత్రికి తరలించామని చెప్పారు.

కాగా, ఈ దారుణానికి పాల్పడింది ఏ సంస్థకు చెందిన ఉగ్రవాదులో తెలియరాలేదని అక్కడి పోలీసులు తెలిపారు. 2010లోనూ ఇక్కడ ఉగ్రదాడి జరగ్గా.. ఆ ఘటనలో 40మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే.
First published: May 8, 2019, 12:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading