Karachi suicide bomber held a masters degree: పాకిస్థాన్ లో మరోసారి చైనా జాతీయులను టార్టెట్ గా చేసుకుని మంగళవారం ఒక మహిళ మానవ బాంబుగా మారింది. ఈ ఘటనలో ఒక మహిళ తనను తాను పేల్చుకుంది. బలూచిస్తాన్ లో కొన్ని రోజులుగా చైనా కార్యకలాపాలను స్థానికులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో మహిళ సూసైడ్ బాంబర్ గా మారటం సంచలంనంగా మారింది. ఆ మహిళ.. ఎంఫిల్ చదివింది. ఆమెకు.. ఇద్దరు పసిబిడ్డలున్నారు. ఆమె విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చి ఇలాంటి పనిచేసిందంటూ అందరు ఆశ్చర్యానికి గురౌతున్నారు.
కరాచీలో మంగళవారం యూనివర్సిటీలో సూసైడ్ బాంబర్ గా మారిన మృతురాలి పేరు షారీ బలోచ్ (30). ఆమె జువాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. అదే విధంగా, ఎంఫిల్ పట్టా పొందింది. టీచర్ గా పనిచేస్తోంది. ఆమె భర్త డెంటిస్ట్. తండ్రి ఒక లెక్చరర్. విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు ఊహ తెలియని ఇద్దరు పసిపిల్లలున్నారు. వారిలో ఒకరికి ఎనిమిదేళ్లు. ఇంకొరికి ఐదేళ్లు. ఆ కుటుంబానికి ఉగ్రవాద చరిత్ర లేదు. ఇలాంటి ఈమె రెండేళ్ల క్రితం బీఎల్ఏలోని మజీద్ బ్రిగేడ్ లోని ఆత్మాహుతి దళంలో చేరింది.
అయితే, కరాచీల ప్రజలు చైనా వారిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సదరు యువతికి చిన్నపిల్లలు ఉన్న కూడా తన ప్రాణాలను లెక్కచేయకుండా ఆత్మహుతికి పాల్పడింది. ప్రస్తుతం.. బలూచిస్థాన్ లో ప్రత్యక్షంగా, పరోక్షంగా చైనా చర్యలను సహించబోమని స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ఇక్కడి .. బలూచ్ వనరులను కొల్లగొట్టడం, బలూచ్ ప్రజలపై మారణహోంం నిర్వహిస్తోన్న పాక్ ఆర్మీకి సహకరించడం మానుకోవాలని.. చైనాను చాలాసార్లు.. హెచ్చరించారు. కానీ చైనా పట్టించుకోలేదు. ఇప్పటికైనా బలూచిస్థాన్ ను దోపీడి చేయడం మానుకోవాలని బీఎల్ఏ హెచ్చరిస్తున్నారు. ఈ ఆత్మహుతి దాడి తర్వాత.. షారీ బలోచ్ భర్త.. ట్వీటర్ లో స్పందించారు. షారీ ఆత్మహుతి పట్ల గర్వంగా ఉందని చెప్పారు.నీ గొప్ప త్యాగం తెలుసుకుంటూ మన పిల్లలు ఎదుగుతారని ట్వీట్ చేశాడు. తన భార్యతో ఉన్న ఫోటోలను షేర్ చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bomb attack, Crime news, Pakistan, Woman suicide