ఇన్సూరెన్స్ సొమ్ముకోసం పనిమనిషి హత్య.. ఓ రోజు ఫోన్ రింగ్...

సుబ్బరాయుడు.. భాస్కర్ రెడ్డి వద్ద పనిచేస్తున్నాడు. సుబ్బరాయుడు అనాథ. దీంతో సుబ్బరాయుడు పేరు మీద భాస్కర్ రెడ్డి సుమారు రూ.32 లక్షల ఇన్సూరెన్స్ చేశాడు.

news18-telugu
Updated: August 25, 2019, 2:48 PM IST
ఇన్సూరెన్స్ సొమ్ముకోసం పనిమనిషి హత్య.. ఓ రోజు ఫోన్ రింగ్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇన్సూరెన్స్ సొమ్ముకోసం ఓ వ్యక్తి తన ఇంట్లో పనిచేసే వ్యక్తిని దారుణంగా చంపించాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. 2015లో కర్నూలు జిల్లా అవుకులో సుబ్బరాయుడు అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. యాక్సిడెంట్‌గా భావించిన పోలీసులు.. ఆ మేరకు కేసు నమోదు చేశారు. అయితే, అది రోడ్డు ప్రమాదం కాదని, సదరు సుబ్బరాయుడు అనే వ్యక్తి పనిచేసే ఇంటి యజమాని భాస్కర్ రెడ్డి అతడిని హత్య చేయించాడంటూ పోలీసులకు కొన్ని రోజుల క్రితం ఓ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అధికారులు పాత ఫైల్ దుమ్ముదులిపారు. అసలు విషయం కోసం విచారణ ప్రారంభించారు. సుబ్బరాయుడు పనిచేసే ఇంటి యజమాని భాస్కర్ రెడ్డిని విచారించారు. అయితే, అతడు తనకేం తెలియదంటూ బుకాయించాడు. కానీ, పోలీసులు తమదైన ట్రీట్‌మెంట్ ఇవ్వడంతో అసలు నిజం కక్కాడు. సుబ్బరాయుడు.. భాస్కర్ రెడ్డి వద్ద పనిచేస్తున్నాడు. సుబ్బరాయుడు అనాథ. దీంతో సుబ్బరాయుడు పేరు మీద భాస్కర్ రెడ్డి సుమారు రూ.32 లక్షల ఇన్సూరెన్స్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఇన్సూరెన్స్ సొమ్ముకోసం సుబ్బరాయుడిని పథకం ప్రకారం హత్య చేయించాడు. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. ఇప్పుడు పోలీసులు ఆ కేసును ఛేదించారు.

First published: August 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు