సోషల్ మీడియాలో 200 మంది యువతులకు వల.. ఆ తర్వాత ఏం చేశాడంటే..

మహిళలు, యువతులను సామాజికమాధ్యమాల వేదికగా చేసుకుని అసభ్యకర వీడియోలతో వారిని మభ్యపెట్టి పలు రకాలుగా మోసం చేసి లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

news18-telugu
Updated: June 10, 2020, 7:46 AM IST
సోషల్ మీడియాలో 200 మంది యువతులకు వల.. ఆ తర్వాత ఏం చేశాడంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ యువకుడు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఇప్పటివరకు 200 మంది యువతులను వేధింపులకు గురిచేయగా, మరో 31 మంది మహిళలను పలురకాలుగా మోసం చేసిన ఊదంతమిది. ఇది రాష్ట్రవ్యాప్తంగా జరగ్గా, చివరకు నల్లగొండ పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అతడి పేరు పార్శ అఖిల్ అలియాస్ చందు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట స్వగ్రామం. ఇతడు సికింద్రాబాద్‌లోని అడ్డగుట్ట పరిధిలో ఓ హోమ్ సెంటర్‌లో వార్డు బాయ్‌గా పనిచేస్తున్నాడు. తనతో పాటు పనిచేసే నర్సులు, వారి స్నేహితుల నంబర్లు సేకరిస్తున్నాడు. అనంతరం మహిళలు, యువతులను సామాజికమాధ్యమాల వేదికగా చేసుకుని అసభ్యకర వీడియోలతో వారిని మభ్యపెట్టి పలు రకాలుగా మోసం చేసి లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

అంతటితో ఆగకుండా బెదిరింపులకు దిగుతూ సోషల్ మీడియాలో మహిళలు యువతుల పట్ల అసత్య ప్రచారం చేస్తున్నాడు. అయితే ఈ క్రమంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి చెందిన పి.మంజుల(పేరు మార్చాం) అనే యువతి నల్లగొండ పట్టణంలోని జమా మసీదులో నివాసం ఉంటున్న ఓ వృద్ధ రోగికి సేవలు చేసేందుకు నల్లగొండకు వచ్చింది. సదరు యువతిని ట్రాప్ చేసిన అఖిల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆ యువతి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.

చివరి నిమిషంలో నల్లగొండ షీ టీమ్ పోలీసులకు వాట్సప్ ద్వారా సమాచారం ఇచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అసలు విషయాన్ని బయటకు రాబట్టారు. సదరు యువకుడు అఖిల్ ఇప్పటివరకు సోషల్ మీడియా వేదికగా పాల్పడిన లైంగిక వేధింపులన్నింటిపైనా సమగ్రమైన విచారణ చేసి అందరికీ న్యాయం చేస్తామని నల్లగొండ ఎస్పీ రంగనాథ్ తెలిపారు.

Published by: Narsimha Badhini
First published: June 10, 2020, 6:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading