100 కేజీల ఆవు పేడను దొంగిలించారని కేసు నమోదు..ఎక్కడంటే...

లల్లా రామ్, సెమ్ లాల్ రైతులు ఇద్దరూ 100 కిలోల ఆవు పేడ కనిపించకపోవడంతో స్థానిక గౌతన్ సమితి (పశువుల షెడ్ ప్రాంగణాన్ని నిర్వహించే సంస్థ) కు ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: August 9, 2020, 10:40 PM IST
100 కేజీల ఆవు పేడను దొంగిలించారని కేసు నమోదు..ఎక్కడంటే...
ఫుట్‌బాల్‌తో ఆవు
  • Share this:
గ్రామాల్లో కొన్ని సార్లు వింత వింత దొంగతనాలు జరుగుతుంటాయి. అలాంటి వింతే చత్తీస్ గడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఆవు పేడ దొంగిలించాడంటూ నానారభస చేశాడు. ఉత్తర ఛత్తీస్‌గడ్ లోని కొరియా జిల్లాలోని రోజి గ్రామంలో పెద్ద మొత్తంలో ఆవు పేడ దొంగతనం చేశాడనే హడావిడి చేశారు వివరాల్లోకి వెళితే పశుసంపద మరియు పాడి యజమానుల ప్రోత్సహించడానికి కిలో ఆవు పేడను రూ .2 చొప్పున సేకరించే లక్ష్యంతో భూపేష్ బాగెల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకమైన 'గోధన్ న్యాయ్ యోజన' పథకాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన చోటుచేసుకుంది.

లల్లా రామ్, సెమ్ లాల్ రైతులు ఇద్దరూ 100 కిలోల ఆవు పేడ కనిపించకపోవడంతో స్థానిక గౌతన్ సమితి (పశువుల షెడ్ ప్రాంగణాన్ని నిర్వహించే సంస్థ) కు ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ ఆవు పేడను రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించడానికి సేకరించారు. ఈ కొత్త తరహా నేరానికి ఏం చేయాలో పాలుపోక సమితి సభ్యులు పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేయాలనుకున్నారు. అయితే ఈ లోగా ఆవు పేడను స్థానికులు కొందరు తీసుకెళ్లినట్లు తేలింది. దీంతో అయితే పోలీసులకు చేరేలోపు సమస్య స్నేహపూర్వకంగా పరిష్కరించినట్లు కొరియా జిల్లా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సంగీత లక్రా అన్నారు.

కాగా కొత్త పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 5 న రూ .1.65 కోట్లను 46000 పశువుల యజమానుల ఖాతాలకు బదిలీ చేసింది. దీంతో పశువుల పేడకు ఆర్థిక విలువను చేకూరింది. ఈ పేడతో పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తులను తయారు చేస్తోంది.
Published by: Krishna Adithya
First published: August 9, 2020, 10:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading